ETV Bharat / crime

ప్రగతి భవన్​ ముందు కుటుంబం ఆత్మహత్యాయత్నం.. కారణం ఏంటంటే..! - Family suicide attempt

Family suicide attempt: ఎప్పుడు పోలీసులు, అధికారులతో బిజీబీజీగా ఉండే ప్రగతి భవన్​ వద్ద ఓ వ్యక్తి కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నం చేసుకోవడం ఒక్కసారిగా కలకలం రేపింది. ఇంతకి అతను ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసుకోవాల్సి వచ్చింది.. ఎక్కడి నుంచి ప్రగతి భవన్​కు వచ్చారంటే..!

Family attempted suicide at Pragati Bhavan

author img

By

Published : Jan 30, 2023, 3:14 PM IST

Family suicide attempt: ప్రగతి భవన్ ముందు కుటుంబంతో సహా ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఇవాళ అధికారుల ముందు తన గోడును వెల్లబుచ్చుకునేందుకు ఇబ్రహీంపట్నంకు చెందిన ఐలేశ్​ అనే వ్యక్తి వినతి పత్రం తీసుకొని తన కుటుంబంతో సహా ప్రగతి భవన్​కు వచ్చాడు. అంతలోనే తనతో తెచ్చుకున్న కిరోసిన్​ ఒంటిపై పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడ విధులు నిర్వర్తిస్తోన్న భద్రత సిబ్బంది వెంటనే గమనించి అతని చేతిలోని కిరోసిన్​ బాటిల్​ను లాక్కున్నారు.

బాధితుడు ఐలేశ్​ తెలిపిన వివరాలు ప్రకారం 2010 సంవత్సరంలో తన భూమిని ప్రభుత్వం తీసుకొని ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించడం లేదని ఆరోపణలు చేశారు. తక్షణమే తన కుటుంబానికి పరిహరం ఇప్పించాలని ముఖ్యమంత్రికి విన్నతిపత్రం ఇచ్చేందుకు కుటుంబంతో ప్రగతి భవన్​కు వచ్చినట్లు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.