కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బురుగుడా గ్రామంలో నకిలీ పత్తి విత్తనాలు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. తనిఖీలు చేపట్టారు. మెకార్తి శ్రీనివాస్ ఇంట్లో నిలువ ఉన్నట్లు గుర్తించారు. ఈ సోదాల్లో 120 కిలోల బీటీ3 నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 2 లక్షల 40వేల విలువ ఉన్నట్లు తెలిపారు. వాటిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి.. నలుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. నిషేధిత పత్తి విత్తనాలు, గడ్డి మందులు అక్రమంగా నిలువ ఉంచి.. విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: 'కుటుంబ ఆత్మహత్య అనుమానాస్పద మృతిగా ప్రాథమిక నిర్ధరణ'