ETV Bharat / crime

Fake Certificates: నకిలీ సర్టిఫికేటుగాళ్లు అరెస్ట్.. కంప్యూటర్లు, స్టాంపులు స్వాధీనం - యాకుత్‌పురా

Fake Certificates: నకిలీ సర్టిఫికెట్లు రూపొందిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరి నుంచి పలు విశ్వవిద్యాలయాలకు చెందిన నకిలీ పట్టాలు, కంప్యూటర్లు, స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతవిద్య కోసం ఏజెంట్లుగా వ్యవహరిస్తూ తెరవెనక నకిలీ పత్రాల తయారీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Fake certificates gang arrest in Hyderabad
నకిలీ సర్టిఫికేటుగాళ్లు అరెస్ట్
author img

By

Published : Dec 19, 2021, 3:38 AM IST

Fake Certificates: వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను రూపొందిస్తున్న ముఠాను హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితుల నుంచి పలు విశ్వవిద్యాలయాలకు చెందిన నకిలీ డిగ్రీ పట్టాలు, కంప్యూటర్లు, స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు.

విదేశీ విద్యకు ఎజెంట్లుగా వ్యవహరిస్తూ..

Qbaze oversies education: యాకుత్‌పురాకు చెందిన నవీద్, గౌలీపూరాకు చెందిన సయ్యద్ ఓవైసీ బర్కత్‌పురలోని బాబూఖాన్ ఎస్టేట్​లో క్యూబెజ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కార్యాలయం నడుపుతున్నారు. విదేశాల్లో ఉన్నతవిద్య కోసం ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న ఇద్దరు తెరవెనక మాత్రం డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు క్యూబెజ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కార్యాలయంపై టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది దాడులు నిర్వహించారు. ఇద్దరు నిందితులపై హైదరాబాద్ కమిషనరేట్‌లోని మూడు పోలీస్‌స్టేషన్లతో పాటు నిజమాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలోనూ కేసులున్నట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.