జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆ గ్రామ మాజీ సర్పంచ్ బరిగె మల్లయ్య ఇళ్లు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించినా.. వాహనం చేరుకునేలోపే అంతా జరిగిపోయిందని స్థానికులు తెలిపారు.
ఈ ప్రమాదంలో సుమారు రూ. 15 లక్షల మేర ఆస్థినష్టం జరిగిందని బాధితుడు తెలిపాడు. మంటలు చెలరేగడానికి షార్ట్‌సర్క్యూట్ కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఉగాది పండుగ రోజున ఈ ఆగ్ని ప్రమాదం జరగడం పట్ల బాధితులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకున్నారు.
ఇదీ చదవండి: విద్యుదాఘాతంతో గిరిజన రైతు మృతి