ETV Bharat / crime

Karvy Case: డొల్ల కంపెనీల్లో నిధులను ఎక్కడికి మళ్లించారు? - పార్ధసారథి ఈడీ

కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ వేల కోట్ల నిధుల అక్రమాల వ్యవహారం ఆరా తీసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఆ సంస్థ ఛైర్మన్‌ పార్ధసారథిని ఈడీ విచారిస్తోంది. సీసీఎస్​ పోలీసుల దర్యాప్తు సాగుతుండగానే... మనీలాండరింగ్​పై ఈడీ దర్యాప్తు చేపట్టింది. నిధులు ఎక్కడికి మళ్లించారనే అంశంపై దర్యాప్తు సంస్థ దృష్టి పెట్టింది.

Karvy Case
Karvy Case
author img

By

Published : Sep 8, 2021, 5:09 AM IST

బ్యాంకులను మోసం చేసిన కేసులో కార్వీస్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ ఛైర్మన్ పార్ధసారథిని ఈడీ ప్రశ్నిస్తున్నారు. మంగళవారం చంచల్​గూడ జైలుకు వెళ్లిన ఈడీ అధికారులు జైలు ఆవరణలోని ఓ గదిలో పార్థసారథిని ప్రశ్నించారు. మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు... కార్వీ బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెట్టుబడిదారులకు సంబంధించిన షేర్లను బ్యాంకుల్లో తనఖా పెట్టిన పార్థసారథి దాదాపు రూ.1200 కోట్ల రుణం తీసుకొని వాటిని డొల్ల కంపెనీల్లోకి మళ్లించారు. డొల్ల కంపెనీల్లో నష్టం వచ్చినట్లు చూపి బ్యాంకర్లకు తిరిగి రుణం చెల్లించలేదు. డొల్ల కంపెనీల్లోనూ డబ్బులను ఎక్కడికి మళ్లించారనే కోణంలో ఈడీ అధికారులు వివరాలు సేకరించారు.

కార్వీ సంస్థపై సైబరాబాద్​లోనూ కేసు నమోదైంది. ఐసీఐసీఐ బ్యాంకులో రూ.560 కోట్ల రుణం తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు గచ్చిబౌలి పీఎస్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన సైబరాబాద్ ఆర్థిక విభాగానికి చెందిన పోలీసులు నాంపల్లి కోర్టు అనుమతితో పార్థసారథిని కస్టడీలోకి తీసుకున్నారు. 9వ తేదీ వరకు సైబరాబాద్ పోలీసులు పార్థసారథిని ప్రశ్నించనున్నారు. ఐసీఐసీఐ బ్యాంకులో రుణం తీసుకున్న కేసులో పూర్తి వివరాలను సైబరాబాద్ ఆర్థిక విభాగం పోలీసులు సేకరించనున్నారు.

KRMB: ఆ ప్రాజెక్టులపై తెలంగాణ ఫిర్యాదు.. ఏపీకి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.