జూదం ఆడేందుకు విదేశాలకు వెళ్తున్నామని చెప్పి...భారీగా నిధుల మళ్లింపుకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ.... కొందరు టూర్ అపరేటర్లపై ఐదునెలల క్రితం కేసు నమోదు చేసింది. విచారణలో భాగంగా హైదరాబాద్‌లోని 8 చోట్ల సోదాలు నిర్వహించింది. ఈజనవరిలో సంక్రాంతి పండుగకి ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడలో క్యాసినో నిర్వహించడం తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
తెలుగురాష్ట్రాల నుంచి జూదం ఆడేవారిని ప్రత్యేక ప్యాకేజీల ద్వారా విదేశాలకు తరలించి నిధుల మళ్లింపు పాల్పడుతున్నరనే అనుమానంతో హైదరాబాద్‌కు చెందిన చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి తదితరుల ఇళ్లు, కార్యాలయాల్లో అప్పట్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. గోవా, నేపాల్ థాయ్‌లాండ్‌లో క్యాసినోలు నిర్వహిస్తు తెలుగురాష్ట్రాల నుంచి జూదం ఆడేవారిని...... అక్కడకు తరలిస్తున్నారనేది ఈడీ అభియోగం. ఇందుకు సంబంధించి చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి తదితరులను గతంలో విచారించారు.
విచారణలో భాగంగా చీకోటిప్రవీణ్ వ్యాపార లావాదేవీలు, బ్యాంకు ఖాతాలను.. ఈడీ పరిశీలించగా సుమారు 100 మంది.... పెద్దమొత్తంలో నగదు బదిలీ చేశారని గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ వందమందిలో కొందరిని పిలిపించి విచారించనుందని.. ఇందులో భాగంగానే తలసాని మహేష్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్‌ను పిలిపించి విచారించింది. మంత్రి తలసానిశ్రీనివాస్‌యాదవ్ సోదరులైన వారిద్దర్ని మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి సుమారు 9.30 గంటల వరకు సుదీర్ఘంగా విచారించారు. విచారణ పూర్తైన తర్వాత తలసాని సోదరులు...... మీడియా కంట పడకుండా వెళ్లిపోవడం గమనార్హం. ఈడీ విచారణకు రావాలంటూ తెరాస ఎమ్మెల్సీ రమణకు నోటీసులిచ్చారు.
మెదక్ డీసీసీబీ మాజీ ఛైర్మన్ దేవేందర్‌దర్‌రెడ్డి.... అనంతపురానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ గురునాథరెడ్డికి తాఖీదులు పంపినట్లు తెలిసింది. అయితే తమకు ఎలాంటి నోటీసులు అందలేదని వారు తెలిపారు. మరికొందరికి ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఐటీ, ఈడీదాడులతోపాటు ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ విచారణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ తరుణంలో నాలుగు నెలల క్రితం కేసు క్యాసినో కేసు మరోసారి వెలుగులోకి రావడం కలకలం సృష్టిస్తోంది.
ఇవీ చూడండి: