ఈ బిజ్ డాట్ కామ్‌కు చెందిన మరో రూ.31.63 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈ బిజ్ ఎండీ పవన్ మల్హాన్, ఆయన కుమారుడు హితిక్ ఆస్తులు అటాచ్ చేసింది. 105 బ్యాంకు ఖాతాల్లోని రూ.30.42 కోట్లు తాత్కాలిక జప్తు చేసిన ఈడీ.. మ్యూచ్‌వల్ ఫండ్స్‌లోని రూ.64.94 లక్షలు, లాకర్లలోని రూ.55.74 లక్షల నగలు అటాచ్ చేసింది. గతంలో ఈ సంస్థకు చెందిన రూ.277.97 కోట్ల ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది.
మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసాలకు పాల్పడినట్లు ఈ బిజ్‌పై అభియోగం ఉంది. రూ.1064 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు ఈ బిజ్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరి విచారణ ఆధారంగానే ఈడీ దర్యాప్తు జరుపుతోంది.
ఇదీ చదవండి: పెరుగుతున్న బ్లాక్‌ఫంగస్ కేసులు.. ఈఎన్టీలో పూర్తిస్థాయి వైద్యం