ETV Bharat / crime

Madhapur Accident: మద్యం మత్తులో బీభత్సం.. కారుతో నలుగురిని ఢీకొట్టిన డాక్టర్లు - car accident at hyderabad madhapur

Madhapur Accident: వారంతా డాక్టర్లు. ప్రాణం పోసేవారు. కానీ వారే మద్యం మత్తులో బాధ్యత మరిచి రోడ్డుపై బీభత్సం సృష్టించారు. ఫుల్లుగా తాగి కారు నడపడమే కాకుండా... రోడ్డు దాటుతున్న వారిపైకి దూసుకెళ్లారు. ఈ ఘటనలో నలుగురు పాదచారులకు తీవ్రగాయాలయ్యాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఆదివారం రాత్రి 11.30 గంటలకు మాదాపూర్​ ఇనార్బిట్​ మాల్​ సమీపంలో జరిగింది.

drunken doctors car hits four walkers
drunken doctors car hits four walkers
author img

By

Published : Dec 7, 2021, 3:55 PM IST

Updated : Dec 7, 2021, 4:24 PM IST

Madhapur Accident: మద్యం మత్తులో కారు నడిపి.. ప్రమాదానికి కారణమైన ఇద్దరు వైద్యులపై పోలీసులు కేసునమోదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన.. హైదరాబాద్​ మాదాపూర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగింది.

ఆదివారం రాత్రి 11:30 గంటల సమయంలో మాదాపూర్ ఇనార్బిట్ మాల్ నుంచి అతివేగంగా వచ్చిన కారు.. రోడ్డు దాటుతున్న నలుగురిని బలంగా ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు మాదాపూర్​ ఇనార్బిట్​ మాల్​ చట్నీస్​ హోటల్​లో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Madhapur Accident
డాక్టర్లు వినియోగించిన కారు

దుర్గం చెరువు సమీపంలో ఓ పబ్​లో మద్యం తాగిన వైద్యులు నిఖిల్​రెడ్డి, అఖిల్​రెడ్డి, తరుణ్.. తమ కారులో ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. వీరు ముగ్గురు వైద్యులుగా గుర్తించారు. వీరికి ఆల్కహాల్ పరీక్షలు నిర్వహించారు. డ్రైవర్​ సీట్లో ఉన్న నిఖిల్​రెడ్డికి పరీక్ష చేయగా.. ఆల్కహాల్​ శాతం 116 శాతం, డ్రైవర్ పక్క సీట్లో కూర్చొన్న అఖిల్​రెడ్డికి ఆల్కహాల్ 35 శాతం వచ్చింది. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపినందుకు వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు మాదాపూర్​ పోలీసులు చెప్పారు.

Madhapur Accident: మద్యం మత్తులో బీభత్సం.. కారుతో నలుగురిని ఢీకొట్టిన డాక్టర్లు

ఇదీచూడండి: Banjara hills accident news: బంజారాహిల్స్‌ ప్రమాద ఘటనలో​ రిమాండ్​కు నిందితులు

Last Updated : Dec 7, 2021, 4:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.