ETV Bharat / crime

యూట్యూబర్​తో కలిసి పబ్​కు వెళ్లారు.. కొబ్బరి బొండాల్లో మద్యం తాగారు.. - గచ్చిబౌలి రోడ్డు ప్రమాదం

Gachibowli Accident: హైదరాబాద్​ గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కొబ్బరి బొండాల్లో మద్యం కలిపి సేవించటం వల్లే... కారు అదుపుతప్పి ప్రమాదానికి కారణమయ్యిందని పోలీసులు నిర్ధరించారు. ఈ ఘటనలో యూట్యూబర్​ గాయత్రి సహా.. రోడ్డు పక్కన ఉన్న మరో మహిళ బలయ్యింది.

youtuber gayatri
youtuber gayatri
author img

By

Published : Mar 19, 2022, 4:13 PM IST

Updated : Mar 19, 2022, 7:19 PM IST

Gachibowli Accident : మద్యం సేవించి వాహనం నడపటమే గచ్చిబౌలి ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. రోహిత్, యూట్యూబర్​ గాయత్రి, మరో నలుగురు కలిసి మద్యం సేవించారు. హోలీ సందర్భంగా మద్యం విక్రయించడంపై నిషేధం అమల్లో ఉంది. దీంతో రోహిత్, అతని స్నేహితులు కలిసి ఆన్ లైన్ ద్వారా రహస్యంగా మద్యాన్ని తెప్పించుకున్నారు. మద్యాన్ని కొబ్బరిబొండాలలో నింపుకొని కార్లలో దాచుకున్నారు.

డ్రైవింగ్ చేయొద్దని వారించినా..

మధ్యాహ్నం ప్రిజమ్ పబ్​కు వెళ్లారు. పబ్ బయట కార్లలో కూర్చొని మద్యం సేవించి అనంతరం లోపటికి వెళ్లారు. హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. సాయంత్రం పబ్ నుంచి బయటికొచ్చారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న రోహిత్​ను కారు డ్రైవింగ్ చేయొద్దని స్నేహితులు వారించారు. డ్రైవర్​ను అద్దెకు మాట్లాడుకొని కారులో వెళ్లాల్సిందిగా సూచించారు. అయినప్పటికీ వినకుండా తన గాయత్రితో కలిసి రోహిత్ కారులో బయల్దేరారు.

youtuber gayatri
యూట్యూబర్ గాయత్రి

అపస్మారక స్థితిలో రోహిత్​

వాళ్ల వెనకాలే మరో రెండు కార్లలో రోహిత్ స్నేహితులు ఫాలో అయ్యారు. విప్రో కూడలి వద్దకు రాగానే ఎల్లా హోటల్ వద్ద కారు డివైడర్​ను ఢీకొట్టి బోల్తా పడింది. అక్కడే చెట్లను నీళ్లు పడుతున్న ఎల్లా హోటల్ పనిమనిషి మల్లీశ్వరి ఘటనా స్థలంలోనే మృతి చెందింది. వెనకాల కారులో వస్తున్న స్నేహితులు గమనించి గాయత్రి, రోహిత్ లను ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే గాయత్రి మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. రోహిత్​ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

కొన్ని నెలల క్రితం వారికి పరిచయం

కారు ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకొని ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయాలపాలైన బాధితులు ఎక్కడ ఉన్నారని తెలుసుకోవడానికి పలు ప్రైవేట్ ఆస్పత్రులకు ఫోన్లు చేశారు. చివరికి ఏఐజీ ఆస్పత్రిలో ఉన్నట్లు తెలుసుకొని, అక్కడికి వెళ్లి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన గాయత్రి జూనియర్ ఆర్టిస్టుగా, యూట్యూబ్​లోనూ నటించింది. కొన్ని నెలల క్రితం రోహిత్​తో పరిచయం ఏర్పడినట్లు పోలీసులు గుర్తించారు.

రోహిత్ హెల్త్‌ బులిటెన్‌

రోహిత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఏఐజీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామన్నారు. ఈ మేరకు ఆసుపత్రి వైద్యులు రోహిత్ హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేశారు. అయన తలకు తీవ్ర గాయాలు కావడంతో అత్యవసర చికిత్స అందిస్తున్నామని ఏఐజీ క్రిటికల్‌ కేర్‌ వైద్య బృందం తెలిపింది. ఇప్పుడు ఆయన ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని వైద్యులు వివరించారు.

సంబంధిత కథనం : యూట్యూబర్​ గాయత్రి పబ్​కు వెళ్లిందా.?.. మృతికి ముందు ఏం జరిగింది.?

Last Updated : Mar 19, 2022, 7:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.