శంషాబాద్ వద్ద కారును తప్పించబోయి లారీ బోల్తాపడిన ఘటనలో మరో యువకుడు మృతి చెందాడు. నిన్న ఆరుగురు మృతి చెందగా... ఉస్మానియాలో చికిత్స పొందుతున్న భూదాన్ ప్రాణాలు విడిచాడు. మొత్తం మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఈ ఘటనలో కారును నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదానికి కారణమైన వ్యక్తిని మాదాపూర్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గిరిప్రసాద్గా గుర్తించారు.
ఇదీ జరిగింది..
మాదాపూర్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గిరిప్రసాద్... అదే స్టేషన్లో హోంగార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న సంగమేశ్వర్, మరో స్నేహితుడు మల్లేశ్‌తో కలిసి ఆదివారం ఉదయం కారులో యాదగిరి గుట్టకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్‌కి వచ్చిన ముగ్గురు... ఓ వెంచర్ వద్ద మద్యం సేవించారు. అనంతరం రోడ్డు పైకి వచ్చిన కారు... అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ప్రమాదంలో లారీ బోల్తా పడింది. ఘటనలో లారీలో ఉన్న కూలీల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు. తాజాగా మరో వ్యక్తి ఉస్మానియాలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.
కానిస్టేబుల్ గిరిప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించనున్నారు. ప్రమాదానికి కారణమైన కారుపై గతంలో ర్యాష్ డ్రైవింగ్ చేసినట్లు చలాన్ గుర్తించారు. ముగ్గురికి పరీక్షలు నిర్వహించగా... హోంగార్డు మద్యం సేవించినట్లు... గిరిప్రసాద్ మద్యం సేవించనట్లు వచ్చింది. అందువల్ల అతని రక్త నమూనాలను ల్యాబ్‌కు పంపారు.
ఇదీ చూడండి: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి