ETV Bharat / crime

అమలుకాని పోలీసుల ఆదేశాలు.. మందుబాబుల డ్రైవింగ్‌తో ప్రాణాలకు చేటు.!

author img

By

Published : Oct 6, 2021, 1:12 PM IST

హైదరాబాద్​లో ట్రాఫిక్​ నిబంధనలు, డ్రంక్​ అండ్​ డ్రైవ్​పై పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా.. అవి బూడిదలో పోసిన పన్నీరులా మిగిలిపోతున్నాయి. మందుబాబుల నిర్లక్ష్య డ్రైవింగ్​, నిబంధనల ఉల్లంఘన ఫలితంగా వారే కాకుండా అమాయకులూ బలవుతున్నారు. పోలీసులు.. డ్రంక్​ అండ్​ డ్రైవ్​ కేసుల మీద పెట్టిన శ్రద్ధ.. వారిని ఇళ్లకు క్షేమంగా చేర్చడంపై పెట్టకపోవడంతో మందుబాబుల నిర్లక్ష్య వైఖరికి ఆజ్యం పోసినట్లుగా అయింది.

drunk and drive cases in hyderabad
హైదరాబాద్​లో డ్రంక్​ అండ్​ డ్రైవ్​ కేసులు

ప్రజల శ్రేయస్సురీత్యా పోలీసులు ఇస్తున్న కొన్ని ఆదేశాలు.. ఆచరణలో తుస్సుమంటున్నాయి. పూటుగా మద్యం తాగి డ్రైవింగ్‌ చేస్తున్న కొందరు రాజధాని రోడ్లను రక్తసిక్తం చేస్తున్నారు. ఏటా 600 మందిని బలి తీసుకుంటున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాలని భావించిన పోలీసులు, పబ్బుల్లో భారీగా మద్యం తాగిన వారిని ప్రైవేటు కారు డ్రైవర్ల సాయంతో ఇళ్లకు పంపాలని పబ్‌ యజమానులను ఆదేశించారు. ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నా, పోలీసులు కనీసం పట్టించుకోవడంలేదు. ఫలితంగా, మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారు తమను తాము ప్రమాదంలో పడేసుకోవడమే కాకుండా, ఇతరుల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్నారు.

హెచ్చరించినా.. తీరు మారడం లేదు

నిబంధనలు ఉల్లంఘించి.. మద్యం తాగి వాహనాలు నడిపితే ట్రాఫిక్‌ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. పదేపదే దొరుకుతున్న వారిని కోర్టుల్లో ప్రవేశపెట్టి జైలుశిక్షలు పడేలా చేస్తున్నారు. అయినా చాలామంది తీరు మార్చుకోవడంలేదు. మూడేళ్లుగా డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు పెరుగుతున్నాయి. అర్ధరాత్రి వరకు పబ్‌ల్లో ఇష్టానుసారం మద్యం తాగడం, తరువాత ఖరీదైన కార్లలో నియంత్రణ లేకుండా వేగంగా రోడ్లపై దూసుకుపోతున్నారు. ఈక్రమంలో జరుగుతున్న ప్రమాదాల్లో అనేకమంది దుర్మరణం చెందుతున్నారు. ఈ ప్రమాదాలను నిరోధించడానికే కొన్నేళ్ల కిందట పోలీసులు, పబ్‌ల్లో మద్యం తాగినవారికి సొంత వాహనమున్నా పబ్‌ యాజమాన్యమే ప్రైవేటు డ్రైవర్‌ను ఏర్పాటు చేసి ఇంటికి పంపించాలని ఆదేశించారు. కొద్ది రోజులు పాటించిన పబ్‌ యజమాన్యాలు తర్వాత పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆచరించడం మానేశాయి.

కావాల్సినంత మంది డ్రైవర్లు

మద్యం తాగిన వారిని ఇళ్లకు చేరవేయడంలో సాయానికి సిద్ధమని నగరంలో వేలాది మంది డ్రైవర్లు రిజిస్టర్‌ చేసుకున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసుల నమోదుపై చూపిస్తున్న ఉత్సాహం తమ ఆదేశాల అమలులో చూపడం లేదన్న విమర్శలు పెద్దఎత్తున వస్తున్నాయి. ట్రాఫిక్‌ డీసీపీ రంగనాథ్‌ ఉన్నప్పుడు ఈ ఆదేశాలు పక్కాగా అమలయ్యాయి. ఆయన మారిన తర్వాత పట్టించుకోకపోవడంతో పబ్‌ల్లో తెల్లవారుజాము వరకు మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి.

ఇలా చేయాలంటున్న నిపుణులు

రిజిస్టర్‌ చేసుకున్న ప్రైవేటు డ్రైవర్లను పబ్‌లు, బార్‌ల వద్ద సిద్ధంగా ఉంచాలి. సొంత వాహనాల్లో వచ్చే వారిని వారి వాహనంలోనే ఈ డ్రైవర్లతో ఇంటికి పంపించేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ఒకట్రెండు నెలలు ట్రాఫిక్‌ పోలీసుల పర్యవేక్షణ ఉండాలి. తెల్లవారుజాము వరకు నడుస్తున్న పబ్‌లు అర్ధరాత్రి తర్వాత మూతపడేలా చర్యలు తీసుకోవాలి. పట్టించుకోని యాజమాన్యాలపై కేసులు నమోదు చేసి కోర్టుల్లో ప్రవేశపెట్టాలి. ఈ విషయంలో డీజీపీ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.

మూడు కమిషనరేట్ల పరిధిలో గణాంకాలు

ఇదీ చదవండి: Pollution in Hyderabad: అమ్మోనియా తీవ్రత పెరుగుతోంది.. జాగ్రత్త..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.