ETV Bharat / crime

హైదరాబాద్​ కేంద్రంగా అమెరికాకు నిషేధిత డ్రగ్స్​.. నిందితుడు అరెస్ట్​ - hyderabad news

Drug supply to America from Hyderabad
హైదరాబాద్​ కేంద్రంగా డ్రగ్స్​ రవాణా
author img

By

Published : May 8, 2022, 11:44 AM IST

Updated : May 8, 2022, 1:14 PM IST

11:41 May 08

Drugs Supply to America from Hyderabad: హైదరాబాద్‌ కేంద్రంగా నిషేధిత డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ఆశిష్‌ జైన్‌ అరెస్టు

Drug supply to America from Hyderabad
నిందితుడు ఆశిష్ నివాసం..

Drugs Supply to America from Hyderabad: హైద‌రాబాద్ కేంద్రంగా నిషేధిత డ్రగ్స్ స‌ర‌ఫరా చేస్తున్న వ్యక్తిని ఎన్సీబీ(మాదకద్రవ్యాల నియంత్రణ శాఖ) అధికారులు అరెస్ట్ చేశారు. అమెరికాతో పాటు ప‌లు దేశాల‌కు వారి వినోదం, అవ‌స‌రాల కోసం ఇంట‌ర్నెట్ ఫార్మసీ ద్వారా హైదరాబాద్​ నుంచి ఔష‌ధాల రూపంలో పంపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుడు ఆశిష్ జైన్ నుంచి డ్రగ్స్​తో పాటు రూ. 3.71 కోట్ల న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్​ కొనుగోలుదారుల నుంచి ఆశిష్​ జైన్​ ప‌లు ర‌కాల లావాదేవీలతో పాటు బిట్ కాయిన్లు తీసుకుంటున్నట్లు ఎన్సీబీ అధికారులు గుర్తించారు.

విదేశాల‌కు నిషేధిత డ్రగ్స్ స‌ర‌ఫ‌రా చేస్తున్నారని.. హైద‌రాబాద్ కేంద్రంగా ఈ గుట్టు సాగుతోందని ఎన్సీబీ అధికారులకు స‌మాచారం అందింది. దీంతో ఒక ప్రత్యేక బృందం.. హైద‌రాబాద్​లోని దోమ‌లగూడలో ఆశిష్​ ఇంటిపై దాడులు నిర్వహించింది. జేఆర్ ఇన్ఫినిటీ పేరుతో ఆశిష్​ జైన్​ ఈ దందా చేస్తున్నట్లు గుర్తించారు. అత‌ని వ‌ద్ద నుంచి భారీగా నిషేధిత ఔష‌ధాలతో పాటు వాటి ద్వారా సంపాదించిన రూ. 3.71కోట్ల న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో చ‌ర‌వాణులు, ల్యాప్ టాప్​లు, ఇతర ఎలక్ట్రానికి ఉపకరణాలు స్వాధీనం చేసుకున్నారు.

దోమ‌ల్​గూడలోని ఓ ఇంట్లో ఆశిష్ జైన్ నివాసం ఉంటూ.. జేఆర్ ఇన్ఫినిటీ పేరుతో ఓ ఇంట‌ర్నెట్ ఫార్మ‌సీని నిర్వహిస్తున్నాడు. అమెరికాతో పాటు, పలు దేశాల‌కు సైకోట్రోపిక్​లో నిషేధిత ఆక్సికోడోన్, హైడ్రోకోడోన్, ఆల్పాజోలాం, డ‌యాజెపమ్, లోరాజెప‌మ్, క్లోన‌జెప‌మ్, జోల్పిడ‌మ్, ట్రమొడాల్ వంటి ఔష‌ధాలను.. ఆర్డర్లపై స‌ర‌ఫ‌రా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మెయిల్, ఇంటర్నెట్ వాయిస్ కాల్స్​తో విదేశీయుల నుంచి ఆర్డర్లు తీసుకుంటున్నారు. జేఆర్​ ఇన్ఫినిటీ పేరుతో ఖాతా తెరిచి.. ముందుగా పేమెంట్ చేయించుకున్నాడు. క్రెడిట్ కార్డ్, పేపాల్​తో పాటు బిట్ కాయిన్లను కూడా అనుమ‌తిస్తున్నాడు. డబ్బులు అంద‌గానే అత్యవసర ఔష‌ధాల పేరుతో నిషేధిత డ్రగ్స్​ను.. ఎయిర్ కార్గో, షిప్​మెంట్​ల ద్వారా సంబంధిత చిరునామాకు కొరియ‌ర్ చేస్తున్నాడు.

గ‌త రెండేళ్లలో ఆశిష్​ జైన్​ వెయ్యికి పైగా కొరియ‌ర్లను భార‌త్ నుంచి అమెరికాతో పాటు ఇతర దేశాలకు ఈ సైకోట్రోపిక్ డ్రగ్స్​ను పంపించినట్లు ఎన్సీబీ విచారణలో తేలింది. నిందితుడిని అరెస్ట్ చేసిన అధికారులు.. విచార‌ణ‌లో మ‌రికొంత మందిని అరెస్ట్ చేసే అవ‌కాశం ఉందని వెల్లడించారు.

ఇవీ చదవండి: ATTACK ON LADIES: గంజాయి మత్తులో మహిళలపై దాడి.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు

పోలీసులపై మూకదాడి.. 19మందికి గాయాలు.. 12 వాహనాలు ధ్వంసం

Last Updated : May 8, 2022, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.