cyber crime: చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ సీహెచ్ దశరథంతో.. యువతుల పేరుతో ఇటీవల సైబర్ నేరస్థులు ఛాటింగ్ చేశారు. నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడారు. దాన్ని రికార్డు చేసి.. సామాజిక మాధ్యమాల్లో పెడతామంటూ బెదిరింపులకు దిగారు. సదరు అధికారి ఆ బెదిరింపులను పట్టించుకోకపోవడంతో.. సీబీఐ అధికారి అజయ్‌కుమార్ పాండే పేరుతో నిందితుడు ఫోన్ చేశాడు.
మీ అసభ్య వీడియోపై యూట్యూబ్ నుంచి ఫిర్యాదు అందిందని.. తనకు డబ్బు చెల్లిస్తే తదుపరి చర్యలు తీసుకోబోమని నమ్మించాడు. సీబీఐ పేరుతో నకిలీ లేఖ కూడా పంపాడు. రాహుల్‌శర్మ అనే వ్యక్తి నంబరు ఇచ్చి కాల్ చేయాలని సూచించాడు. బాధితుడు అతడికి ఫోన్ చేశాక.. వీడియోలు తొలగించేందుకు రెండు విడతల్లో రూ.97,500 బదిలీ చేశాడు. ఆ తర్వాత తన దగ్గర మరో రెండు వీడియోలు ఉన్నాయని.. వాటిని వైరల్ చేయకుండా ఉండాలంటే రూ.85 వేలు పంపాలని బెదిరించాడు.
పదే పదే బెదిరింపులు రావడంతో కంగారుపడుతున్న దశరథంను తోటి అధికారి గమనించి వివరాలు తెలుసుకున్నారు. సైబర్ మోసమని చెప్పడంతో బాధితుడు కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరిపి సైబర్ కేటుగాడి బ్యాంకు ఖాతాలో 45 వేల రూపాయలు స్తంబింపజేసి... ఆ నగదును దశరథం ఖాతాలోకి వచ్చేలా చేశారు. మిగతా సొమ్ము పశ్చిమ బంగాల్‌లోని ఓ ఏటీఎం కేంద్రం నుంచి నేరగాడు నగదు డ్రా చేసుకున్నట్టు తేలింది.
ఇవీ చదవండి:
న్యూడ్ కాల్స్‌తో బురిడీ.. రూ.లక్షలు లాగేసిన కిలేడి.. సాయం చేస్తానని 'పోలీసు' టోకరా
పాల ట్యాంకర్, బస్సు మధ్య నలిగి 9 మంది మృతి.. అందరిదీ ఒకే ఫ్యామిలీ!
బరిలో 16 దేశాలు.. సూపర్ అనిపించేదెవరో?
భాగ్యనగరాన్ని వదలని వరుణుడు.. ఇంకా రెండు రోజులు ఇదే పరిస్థితి!