ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కోప్రగాడి సంజయ్ అనే వ్యక్తికి రంగారెడ్డి కోర్టు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఎల్బీనగర్లో నివాసం ఉంటున్న సంజయ్ 2017 ఆగస్టులో అదే ప్రాంతంలో నివాసం ఉండే ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఘటనపై బాలిక తల్లి ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి, సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు. విచారణ జరిపిన మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి నిందితునికి 14 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించారు.
నిందితునికి శిక్ష పడేలా సాక్ష్యాలు సేకరించిన ఎల్బీనగర్ పోలీసులను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అభినందించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలోని అన్నికోర్టుల్లో ప్రత్యక్ష విచారణ నిలిపివేత