మేడ్చల్ జిల్లా కాప్రా ఏఎస్రావు నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నాలుగు నెలల పసికందు(Baby girl death) మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె మరణించిందని మృతురాలి తల్లిదండ్రులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు.
అల్వాల్‌కు చెందిన మధు.. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న తన కుమార్తె హివాన్షికను ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆ చిన్నారి మృతి చెందగా.. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ పాప(Baby girl death) మరణించిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. లక్షల రూపాయలు కట్టించుకుని తమ బిడ్డను కాపాడలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు ఆ ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాల వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆగ్రహం చెందిన మృతురాలి తల్లిదండ్రులు.. తమ 'బిడ్డ(Baby girl death) ప్రాణాలను తిరిగి తీసుకొస్తారా?' అని పోలీసులను నిలదీశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల తమ పాప(Baby girl death)తో పాటు ఇంతకుముందు ఎంతో మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.