ETV Bharat / crime

suspicious death: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి.. ఇసుక మాఫియాపై అనుమానం

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. బావిలో పడిపోయిన మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టంకు పంపారు. వచ్చే నివేదిక ఆధారంగా విచారిస్తే తప్పా... అది హత్యనా, ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడా అనే విషయం తేలనుంది.

mahabubnagar district crime news
suspicious death: క్రేన్ సాయంతో మృతదేహం.. పోలీసుల విచారణ
author img

By

Published : Jun 9, 2021, 10:55 PM IST

మహబూబ్​నగర్ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో లభించిన ఓ వ్యక్తి మృతదేహం కలకలం సృష్టించింది. నారాయణపేట జిల్లాలోని మరికల్ మండలం గాజులయ్య తండాకు చెందిన కుమార్ నాయక్ (30)తన ముగ్గురు మిత్రులతో కలిసి సోమవారం తెల్లవారుజామున… మరికల్ మీదుగా మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్రవైపు కారులో వెళ్తూ పెద్ద గోప్లాపూర్ దగ్గర కారు నిలిపి బయటకు దిగారు.

డీజిల్ దొంగలుగా అనుమానించిన ఇసుక మాఫియా సభ్యులు ట్రాక్టర్లపై వెళ్తూ… కారులో నుంచి దిగిన ఇద్దరు వ్యక్తులను వెంబడించారు. కారులో ఉన్న ఇద్దరు, మరో యువకుడు మాఫియా సభ్యుల నుంచి తప్పించుకున్నారు. మిగిలిన యువకుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో గోప్లాపూర్ సమీపంలో ఉన్న బావిలో ప్రమాదవశాత్తు పడ్డాడా, లేక వెంబడించిన వారు హత్య చేసి బావిలో వేశారా అని బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

బాధితుడి బంధువులు, మిత్రులు మాత్రం హత్య చేసి బావిలో వేశారని పలువురు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని క్రేన్ సాయంతో బయటకు తీసి మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రి తరలించారు. పోస్టుమార్టంలో వచ్చే నివేదిక ఆధారంగా విచారణ కొనసాగించనున్నట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య రాధమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలరు. ఘటనా స్థలంలో సీఐ రజితా రెడ్డి, భగవంత రెడ్డి విచారణ చేపట్టారు.

ఇదీ చూడండి: Father, Daughter dead: తండ్రి, కూతుర్ని నీట ముంచిన మృత్యువు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.