వరంగల్ గ్రామీణ జిల్లాలో ఉన్న ఎస్సార్ఎస్పీ కెనాల్ శవాల దిబ్బగా మారుతోంది. మనస్తాపంతోనో... మరే ఇతర కారణాలతోనో జనాలు కాలువలో పడి విగతజీవులుగా మారుతున్నారు. చూస్తూ ఉండగానే మృతదేహాలు నీటిపై తేలి కొట్టుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే పర్వతగిరి మండలం ఉట్టి తండా మీదుగా ఉన్న ఎస్సార్ఎస్పీ కాలువలో శుక్రవారం రోజు ఓ గుర్తు తెలియని పురుషుడి మృతదేహం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది.
మరోవైపు... ఈ కాలువలో శవాలు రావడం సర్వ సాధారణమని స్థానికులు చెబుతున్నారు. నీటిపై మృతదేహాలు కొట్టుకుపోతున్న వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్గా మారింది.