గొర్రెల లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 20 గొర్రెలు మృతి చెందగా.. డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వనపర్తి జిల్లా బుద్దారం గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను వెంటనే వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
నాగర్కర్నూల్ నుంచి వనపర్తికి గొర్రెల లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం కమాన్ కట్ట విరిగిపోవడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. డీసీఎం డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.