ETV Bharat / crime

MURDERS: కుమార్తెకు ఉరేసి చంపిన కన్నతల్లి... తల్లిని పొడిచి చంపిన కుమారుడు! - kadapa crime

ఏపీ కడపలోని ఓ కుటుంబంలో దారుణం చోటుచేసుకుంది. కుమార్తెను తల్లి హత్య చేయగా.. ఆ తల్లిని కుమారుడు కత్తితో పొడిచి చంపాడు. కడప(kadapa)లో జరిగిన ఈ ఘటన స్థానికులకే గాక.. ప్రతి ఒక్కరినీ భయాందోళనకు గురి చేసింది.

MURDERS: దారుణం.. కుమార్తెను చంపిన తల్లి.. ఆమెను చంపిన కుమారుడు

author img

By

Published : Oct 21, 2021, 4:35 PM IST

కోపం(angry).. ఈ రెండక్షరాలు ఆ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చాయి. తనకు ఎదురు తిరుగుతోందన్న కారణంతో కన్న కూతురిని ఓ తల్లి దారుణంగా హత్య(murder) చేసింది. దీన్ని తట్టుకోలేని కుమారుడు క్షణికావేశంలో తల్లిని కత్తితో పొడిచి హతమార్చాడు. కడప(kadapa)లో జరిగిన ఈ ఘటన స్థానికులకే గాక.. ప్రతి ఒక్కరినీ భయాందోళనకు గురి చేసింది.

కడప నకాష్ వీధికి చెందిన షేక్ హుస్సేన్, షేక్ ఖుర్షీదాలకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి షేక్ అలీమా, షేక్ జమీర్ అనే పిల్లలున్నారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగుతుండడం వల్ల కొంతకాలంగా ఖుర్షీదా .. భర్త నుంచి విడిపోయి వేరుగా నివసిస్తోంది. అప్పుడప్పుడు వారి ఇంటికి భర్త హుస్సేన్ వస్తుండేవాడు.

కేసు నమోదు...

బుధవారం రాత్రి తల్లి ఖుర్షీదా, కూతురు అలీమా మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనతో ఖుర్షీదా కోపోద్రిక్తురాలై అలీమాను ఉరివేసి చంపింది. దీనిని గమనించిన కుమారుడు జమీర్.. తల్లిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్నారు.

ఇవీచదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.