హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా డ్యాన్సర్ మృతిని పోలీసులు హత్యగా తేల్చారు. శిరీన్ అనే యువతి భర్త చనిపోవడంతో తన పిల్లలతో కలిసి ముస్తాఫానగర్‌లో నివసిస్తోంది. మృతురాలు ఫంక్షన్లలో పాటలు పాడడం, డ్యాన్స్ ప్రోగ్రామ్‌లు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ క్రమంలో అఫ్సర్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరి మధ్య ఆ సంబంధం కొనసాగుతుండగా.. అఫ్సర్‌ను పెళ్లి చేసుకోవాలని శిరీన్ అడిగింది. ఇందుకు అఫ్సర్ ఒప్పుకోలేదు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య గొడవలు పెరిగాయి. ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని అతను భావించాడు. శనివారం స్నేహితునితో కలిసి బయలుదేరాడు. లంగర్‌హౌజ్ నుంచి ఆమె ఇంటికే తీసుకెళ్లాడు. కలిసి మద్యం తాగారు. స్నేహితునితో కలిసి ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
మొదట అనుమానాస్పదస్థితిగా కేసు నమోదు
హైదరాబాద్ పాతబస్తీలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి(woman suspicious death) చెందినట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీంతో దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు.
ఆ మహిళ మొదటి భర్తతో విడాకులు తీసుకోగా.. రెండో భర్త నదీం గతేడాది మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆమెకు ఏడుగురు పిల్లలు ఉన్నారని.. ఈవెంట్ ఆర్గనైజర్ అసిస్టెంట్‌గా పనిచేసేదని తెలిపారు.
ఇదీ చూడండి: