ETV Bharat / crime

Cyber Crime: గూగుల్​లో కస్టమర్​ కేర్​ నంబర్​ వెతికి ఫోన్​ చేస్తే.. - telangana latest news

గూగుల్​లో కస్టమర్​ కేర్​ నంబర్​ వెతికి ఫోన్​ చేసిన.. బ్యాంకు ఉద్యోగిని సైబర్​ నేరగాళ్లు బురిడీ (Cyber Crime news) కొట్టించారు. అందినకాడికి దోచుకున్నారు. హైదరాబాద్​ బాలానగర్​ పరిధిలో ఈ ఘటన జరిగింది.

cyber crime
cyber crime
author img

By

Published : Nov 6, 2021, 5:22 AM IST

కస్టమర్​ కేర్​ పేరుతో ఓ బ్యాంకు ఉద్యోగిని సైబర్​ నేరగాళ్లు మోసం (Cyber Crime news) చేశారు. ఈ ఘటన హైదరాబాద్​ బాలానగర్​లో జరిగింది. ఫిరోజ్​గూడకు చెందిన చెందిన ఓ యువతి ఐసీఐసీఐ బ్యాంక్​లో ఉద్యోగం చేస్తున్నారు. బజాజ్​ ఫైనాన్స్​ ద్వారా ఆన్​లైన్​లో ఫోన్​ ఆర్డర్​ చేశారు. పేమెంట్​ చేశాక.. సదరు యువతికి ఎటువంటి మెసేజ్​ రాలేదు. ఆందోళన చెందిన ఆమె గూగుల్​లో బ్యాంక్​ కస్టమర్​ నంబర్​ కోసం వెతికింది. అందులో దొరికిన నంబర్​కు కాల్​ చేసి మాట్లాడారు. అక్కడే సైబర్​ నేరగాళ్లకు చిక్కారు.

బ్యాంక్​ కస్టమర్​ కేర్​ సిబ్బందిలా యువతిని నమ్మించి కేటుగాళ్లు.. మొబిక్విక్ బజాజ్​ వాలెట్​ను ఆమె ఫోన్​లో ఇన్​స్టాల్​ చేయించారు. అనంతరం డెబిట్ కార్డు ద్వారా తొలుత ఐదు రూపాయలు చెల్లించమన్న నేరగాళ్లు.. అంతలోనే ఆమె ఖాతా నుంచి రూ.20 వేల కాజేశారు. అనంతరం మరో రెండు విడతల్లో మరో రెండు వేలు డెబిట్​ అయినట్లు సదరు యువతి ఫోన్​కు మెసేజ్​ వచ్చింది. అప్పటికి మోసపోయానని గుర్తించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు ఫిర్యాదుతో బాలానగర్​ పోలీసులు కేసునమోదు చేశారు.

ఇదీచూడండి: Cyber Crime: సరికొత్తగా.. ఓటీపీ చెప్పకుండానే రూ.19లక్షలు మాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.