Cyberabad CP on Drugs: హైదరాబాద్‌లో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.26 లక్షలకు పైగా విలువైన 183 గ్రాముల కొకైన్, 44 ఎండీ ఎక్స్‌టాసీ మాత్రలు స్వాధీనం చేసుకున్నామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. నూతన సంవత్సర వేడుకలు సమీస్తున్న క్రమంలో నగరంలో డ్రగ్స్, గంజాయి మీద పటిష్ఠ నిఘా పెట్టామని సీపీ తెలిపారు.
నూతన సంవత్సర వేడుకలకు హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. అందుకే డ్రగ్స్, గంజాయిపై పటిష్ట నిఘా పెట్టాం. డ్రగ్స్ సరఫరాలో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశాం. నిందితులపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ నమోదు చేశాం. గోవాకి చెందిన ప్రధాన నిందితుడు జూడ్ పరారీలో ఉన్నాడు. టోలీచౌకికి చెందిన వ్యక్తి వద్ద 181 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నాం. నిజాంపేట్‌కి చెందిన వ్యక్తి వద్ద గ్రాము కొకైన్, ఏపీలోని ప్రకాశం జిల్లాకి చెందిన వ్యక్తి నుంచి గ్రాము కొకైన్ స్వాధీనం చేసుకున్నాం. ఈ ఏడాది సైబరాబాద్‌లో 202 డ్రగ్స్ కేసులు నమోదు కాగా డ్రగ్స్ సరఫరా కేసుల్లో 419 మందిని అరెస్టు చేశాం.
-సీపీ స్టీఫెన్ రవీంద్ర
ప్రధాన నిందితుడు గోవాకు చెందిన జూడ్ పరారీలో ఉన్నాడని... టోలిచౌకికి చెందిన మహమ్మద్ అష్రఫ్ వద్ద 181 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నామని.. సీపీ తెలిపారు. నిజాంపేట్‌కు చెందిన రామేశ్వర శ్రవణ్ కుమార్ వద్ద 1 గ్రాము.. ప్రకాశం జిల్లాకు చెందిన చరణ్ తేజ నుంచి మరో గ్రాము కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులు జావేద్, జూడ్ ఇద్దరూ.. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొని వచ్చారని నిర్ధరణ అయిందని తెలిపారు. జూడ్ మధ్యవర్తిగా గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ రవాణా చేస్తున్నారని గుర్తించామన్నారు.
ఇదీ చూడండి: Drugs Seized at ORR: డ్రగ్స్ పంచుకుంటుండగా.. పోలీసుల ఎంట్రీ.. ముగ్గురు అరెస్ట్