ETV Bharat / crime

Cyber Crime: 'నేను మీటింగ్​లో ఉన్నా.. అమెజాన్​ గిఫ్ట్​కూపన్​ పంపండి' - భూగర్భ గనుల శాఖ అధికారుల పేరుతో సైబర్​ మోసాలు

సైబర్ నేరగాళ్లు (Cyber ​​scams) కొత్త తరహా మోసాలకు తెరలేపారు. సంస్థల వెబ్​సైట్​లో సీఈఓ, డైరెక్టర్ల పేరుతో నకిలీ మెయిల్ తయారు చేసి అమెజాన్ గిప్ట్ కూపన్ పేరుతో క్రింది స్థాయి ఉద్యోగులను మోసం చేస్తున్నారు.

Telangana news
హైదరాబాద్​ నేర వార్తలు
author img

By

Published : Jun 8, 2021, 6:49 AM IST

తెలంగాణ గనులు భూగర్భ శాఖ డైరెక్టర్ పేరుతో సైబర్​ నేరగాళ్లు (Cyber ​​scams) నకిలీ మెయిల్ తయారు చేశారు. ప్రొఫైల్ పేరు మాత్రం అసలైన దాని పేరుతోనే రూపొందించారు. ఆ మెయిల్​తో క్రింది స్థాయి ఉద్యోగులకు... తాను మీటింగ్​లో ఉన్నానని.. అత్యవసరంగా రూ.10 వేలు విలువైన అమెజాన్ గిఫ్ట్ కార్డ్ పంపాలని మెయిల్ చేశారు.

నిజమే అనుకుని స్పందించిన నిజామాబాద్ గనుల శాఖ అధికారి గిఫ్ట్ కార్డ్ కొని వచ్చిన మెయిల్​కే రిప్లై ఇచ్చారు. మరో ఇద్దరు కూడా ఇదే విధంగా పంపారు. విషయం తెలుసుకున్న గనుల శాఖ డైరెక్టర్ రోనాల్డ్ రోస్ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: MURDER: దుర్భాషలాడుతున్నాడని తండ్రినే కడతేర్చాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.