Fake Bank Accounts : దోచుకున్న డబ్బు డ్రా చేసుకునేందుకు సైబర్ కేటుగాళ్లు అమాయకులకు కమీషనర్ ఎర వేస్తున్నారు. విద్యార్ధులు, నిరుద్యోగులు వంటి వారిని సంప్రదిస్తు నేరగాళ్లు వారి ఖాతా ఉపయోగిస్తున్నారు. ఇందుకు గాను వారికి కమీషన్ ఇస్తున్నారు. ఈ తరహా ఖాతాలను మ్యూల్ అకౌంట్లు అంటారు. అపెక్స్ బ్యాంకు నుంచి కొల్లగొట్టిన సొమ్మును ఇదే విధంగా కుత్బుల్లాపూర్‌కు చెందిన యువకుడి ఖాతాను వాడుకున్నారు. రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, జార్ఖండ్ తదితర రాష్ట్రాలకు చెందిన పేద రైతులు, నిరుద్యోగులకు చెందిన ఖాతాలను వాడుకుంటున్నారు. నేరం జరిగిందని గుర్తించిన వెంటనే బాధితులు 155260కు ఫోన్ చేస్తే సదరు లావాదేవీని నిలిపివేస్తున్నారు. అందుకు కొల్లగొట్టిన సొమ్మును నిమిషాల వ్యవధిలో డ్రా చేసుకునేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
వాళ్లే టార్గెట్..
Fake Bank Accounts in Cyber Crimes : ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతాలు ఉండాలన్న ఉద్దేశంతో కేంద్రం చేపట్టిన జన్‌ధన్ ఖాతాలు ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు వరంలా మారాయి. ప్రధానంగా ఉత్తరాదికి చెందిన నిరక్ష్యరాస్యుల జన్‌ధన్ ఖాతాలను సైబర్ నేరాల కోసం వాడుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు. కేవలం ఖాతా వాడుకున్నందుకు డబ్బు వస్తుండడంతో సదరు ఖాతాదారులకు కూడా సులభంగా నేరగాళ్ల మాయలో పడుతున్నారు.
నకిలీ ఖాతాల అడ్డుకట్టతోనే..
Mahesh Bank Server Hack Case : సైబర్ నేరాగాళ్లకు కేవలం ఇటువంటి ఖాతాలు సరఫరా చేసే ముఠాలు కూడా చాలా ఉన్నాయి. దిల్లీ కేంద్రంగా ఈ ముఠాలు ఎక్కువగా పనిచేస్తున్నాయని పోలీసులు గుర్తించారు. నేరగాళ్లతో నిరంతరం వీరు సంప్రదింపులు జరుపుతూ ఖాతాలు సమకూర్చుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో బోగస్ వివరాలతో ఖాతాలు తెరిచే ముఠాలు పనిచేస్తున్నాయి. ఇదే విధంగా హరియాణాకు చెందిన ముజాహిద్, ఆసిఫ్, ఇక్భాల్ కొన్ని వందల ఖాతాలు తెరిచారు. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే నకిలీ ఖాతాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Cyber Crimes in Telangana : మహేశ్ బ్యాంకు ఖాతాలో ముందు 3 ఖాతాల్లోకి 12.90 కోట్లు మళ్లించిన నేరగాళ్లు ఆ డబ్బును మళ్లీ 128 ఖాతాల్లోకి జమ చేసి ఆ తర్వాత సొమ్ము కొల్లగొట్టారు. సెలవు రోజు ఇంత డబ్బు మూడు ఖాతాల్లోకి మళ్లినా గుర్తించలేకపోయారు. ఇటువంటి లావాదేవీ జరిగినప్పుడు బ్యాంకు సిబ్బందిని అప్రమత్తం చేసే వ్యవస్థ అభివృద్ధి చేసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!