ETV Bharat / crime

Cyber Crimes in hyderabad: ఉద్యోగాలు, బహుమతుల పేరుతో వల.. చిక్కితే జేబు గుల్ల - cyber crime in the name of jobs

Cyber Crimes in hyderabad: ఉద్యోగాలు, బహుమతులు అనే ఆశలను ఎరగా వేసి అమాయకుల జేబులను గుల్ల చేస్తున్నారు సైబర్​ నేరగాళ్లు. సైబర్​ నేరాలపై పోలీసులు ఎంతగా అవగాహన కల్పించినా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ఎయిర్​హోస్టెస్​ ఉద్యోగం పేరుతో ఓ యువతిని నమ్మించి రూ. లక్షలు దండుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను సైబర్​ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.

Cyber Crime
సైబర్​ నేరాలు
author img

By

Published : Jan 8, 2022, 8:58 PM IST

Cyber Crimes in hyderabad: ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న 8 మంది సభ్యుల ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 26 చరవాణులు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. ముఠాలో ఐదుగురు యువతులు కూడా ఉన్నారు.

ఉద్యోగాల పేరిట..

దిల్లీలోని మయూర్ విహార్​లో కాల్ సెంటర్ నిర్వహిస్తున్న నిందితులు... వివిధ జాబ్ సైట్లలో నిరుద్యోగుల వివరాలు సేకరించి... వారికి ఫోన్ చేసి ఉద్యోగావకాశం కల్పిస్తామని నమ్మిస్తున్నారు. ప్రాసెసింగ్ ఫీజు, డిపాజిట్ పేరుతో డబ్బులు తీసుకుంటున్నారు. ఓ యువతికి ఎయిర్‌హోస్టెస్‌ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి విడతల వారీగా రూ. 8 లక్షలు వసూలు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన హైదరాబాద్​ సీసీఎస్​ పోలీసులు దిల్లీకి వెళ్లి ముఠాను అరెస్ట్ చేశారు.

బహుమతుల పేరిట...

మరో కేసులో బహుమతుల పేరుతో మోసం చేస్తున్న ఉత్తర్ ప్రదేశ్​కు చెందిన ఇద్దరిని సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులిద్దరూ నైజీరియన్లకు బ్యాంకు ఖాతాలను సమకూరుస్తున్నారని.. నైజీరియన్లు అమాయకులను బహుమతుల పేరుతో నమ్మించి నిందితుల ఖాతాల్లో నగదు జమ చేయిస్తున్నారని హైదరాబాద్​ సీసీఎస్​ సంయుక్త సీపీ గజరావ్​ భూపాల్​ తెలిపారు. జమ అయిన నగదులో 10 శాతాన్ని నిందితులు తీసుకొని మిగతా మొత్తాన్ని నైజీరియన్లకు చెల్లిస్తున్నారు. ఉద్యోగాలు, బహుమతుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్​ను నమ్మి మోసపోవద్దని జాయింట్​ సీపీ గజరావ్ భూపాల్ హెచ్చరించారు.

ఇదీ చదవండి: Man Killed Girlfriend in Karimnagar : పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిని హతమార్చిన ప్రియుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.