ETV Bharat / crime

Cyber Cheating: పెళ్లికి వయసుతో పనేముందంటూ.. రూ. 46 లక్షలకు టోకరా!

author img

By

Published : Apr 23, 2022, 12:04 PM IST

Cyber Cheating: పెళ్లికి వయసుతో పనేముంది అంటూ ఓ సైబర్ కి'లేడి' ఓ వ్యక్తి నుంచి రూ.46 లక్షలు కాజేసింది. 50 ఏళ్లు దాటిన వ్యక్తి రెండో వివాహం కోసం మ్యాట్రిమోని ఆశ్రయించగా.. వివరాలు సేకరించి అతడిని బురిడీ కొట్టించింది ఈ కిలేడీ.

Cyber Cheating
Cyber Cheating

Cyber Cheating: మీ వయసు 50.. నా వయసు 25 అయినా.. పట్టించుకోను.. మిమ్మల్నే పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.46 లక్షలు కాజేసిందో సైబర్‌ ‘కి‘లేడి’. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. జూబ్లిహిల్స్‌లో నివాసముండే 50 ఏళ్లు దాటిన వ్యక్తి రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మ్యాట్రిమోని సైట్‌లో తన ప్రొఫైల్‌ పెట్టారు. ఇది జరిగిన రెండో రోజే ఓ అమ్మాయి డీపీతో ఉన్న ఫేస్‌బుక్‌ ఖాతా నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. దానికి అంగీకరించారు. మీరు నచ్చారు. మిమ్మల్నే పెళ్లి చేసుకుంటానని నమ్మించింది. ఇంజినీరింగ్‌ చదువుతున్నట్లు చెప్పి ఫీజు కట్టాలని, కొవిడ్‌ వచ్చిందని.. ఇలా పలు కారణాలతో మొత్తం రూ.46 లక్షలు లాగేసింది. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులను ఆశ్రయించారు.

ఎంబీబీఎస్‌ సీట్లు ఇప్పిస్తామని రూ.10.50 లక్షలు: కవాడిగూడకు చెందిన తోడల్లుళ్లు తమ ఇద్దరి పిల్లలకు నీట్‌లో మంచి ర్యాంక్‌ రాక ఎంబీబీఎస్‌ సీటు దక్కలేదు. మీ పిల్లలకు రాయ్‌చూర్‌లో సీట్లు ఇప్పిస్తానని ఓ వ్యక్తి ఫోన్‌ చేసి నమ్మించాడు. దీంతో తోడల్లుళ్లు రెండు సీట్లకు రూ.10.50లక్షలు పంపించేశారు. మరుసటి రోజే రాయ్‌చూర్‌లోని ఓ మెడికల్‌ కళాశాలలో సీటు వచ్చినట్లుగా లెటర్లు వచ్చాయి. అక్కడకు వెళ్లగా నకిలీవని తేలింది. బాధితులు సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.