ఫేస్బుక్లో అమ్మాయిల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి సైబర్ నేరగాళ్లు వరుస మోసాలకు పాల్పడుతున్నారు. లేడీ డాక్టర్ అవతారమెత్తిన ఓ సైబర్ మోసగాడు.. ఎఫ్బీలో ఫ్రెండ్ రిక్వస్ట్ పెట్టి ఓ వైద్యుడికి పరిచయమయ్యాడు. ప్రేమ పేరుతో వల విసిరాడు. అనంతరం విలువైన గిఫ్ట్ పంపిస్తామని కేటుగాళ్లు నమ్మించారు. దిల్లీ ఎయిర్ పోర్టు నుంచి కస్టమ్స్ అధికారులమంటూ ఫోన్ చేశారు. కస్టమ్, ఇతర ఛార్జీల పేరుతో అతని ద్వారా రూ. 24 లక్షలు అకౌంట్లో జమ చేయించుకున్నారు. చివరికి అసలు విషయం తెలిసి బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
మరో కేసులో ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తే అధిక లాభాలు ఇస్తామని చెప్పి హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ. 43 లక్షలు సైబర్ కేటుగాళ్లు కాజేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరు సంఘటనల్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: Agricultural: అగ్రిక్లినిక్లతో నిరుద్యోగులకు ఉపాధి బాటలు!