ETV Bharat / crime

Two Customs Officials: లంచం కేసులో కస్టమ్స్‌ అధికారులకు రిమాండ్ - కస్టమ్స్‌ అధికారులకు రిమాండ్

హైదరాబాద్‌లో లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇద్దరు కస్టమ్స్‌ అధికారులను ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరచినట్లు సీబీఐ వెల్లడించింది. నిన్న హైదరాబాద్​లోని బషీర్‌బాగ్‌ కస్టమ్స్‌ ప్రధాన కార్యాలయం ఆరో అంతస్తులో ప్రివెన్షన్‌ విభాగానికి చెందిన ఇద్దరు కస్టమ్స్‌ అధికారులు పది వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. బంగారం స్మగ్లింగ్‌ కేసులో నిందితునికి బెయిల్‌ రద్దు కాకుండా చూసేందుకు లంచం డిమాండ్​ చేశారు.

remand for Two Customs Officials:
లంచం కేసులో కస్టమ్స్‌ అధికారులకు రిమాండ్
author img

By

Published : Oct 27, 2021, 5:14 AM IST

రాజధాని నగరంలో లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇద్దరు కస్టమ్స్‌ అధికారులను అరెస్టు చేసి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చినట్లు సీబీఐ తెలిపింది. నిన్న బషీర్‌బాగ్‌ కస్టమ్స్‌ ప్రధాన కార్యాలయంలో ప్రివెన్షన్‌ విభాగానికి చెందిన ఇద్దరు కస్టమ్స్‌ అధికారులు రూ. 10వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. బంగారం స్మగ్లింగ్‌ కేసులో అరెస్టు అయిన నిందితుడు షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే అతను ప్రతి నెల రెండు, నాలుగో సోమవారం కస్టమ్స్‌ ప్రధాన కార్యాలయంలో హాజరై సంతకాలు చేయాల్సి ఉంటుంది. నిబంధనల మేరకు నిందితుడు హాజరు కాకపోవడంతో షరతులు పాటించడం లేదని.. ఇలా అయితే బెయిల్‌ రద్దు అవుతుందని కస్టమ్స్‌ అధికారులు హెచ్చరించారు. దీంతో నిందితుడు బెయిల్‌ రద్దు కాకుండా చూడాలని కస్టమ్స్‌ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం రూ.20వేలు లంచంగా ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో.. చివరకు రూ.10వేలకు ఒప్పందం కుదిరింది.

అదే విషయాన్ని నిందితుడు సీబీఐకి సమాచారం ఇచ్చాడు. నిన్న సాయంత్రం కస్టమ్స్‌ ప్రధాన కార్యాలయంలో నిందితుడు లంచం ఇస్తుండగా సీబీఐ అధికారులు దాడులు చేసి రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో పట్టుబడిన కస్టమ్స్‌ సూపరింటెండెంట్‌ సురేష్‌కుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ కిషన్‌ పాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. కస్టమ్స్‌ ప్రధాన కార్యాలయంతో పాటు వారి ఇళ్లలోనూ సోదాలు నిర్వహించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. అరెస్టు చేసిన వారిద్దరినీ ఇవాళ నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చగా.. వారికి న్యాయస్థానం జుడిషియల్‌ రిమాండ్‌ విధించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:

లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన కస్టమ్స్‌ అధికారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.