ETV Bharat / crime

hair illegal transport: హైదరాబాద్‌ టూ చైనా.. జుట్టు దందాతో కోట్ల రూపాయల హవాలా.. - Hair mafia in hyderabad

hair illegal transport: జుట్టే కదా అని తీసిపారేయకుండా కోట్లు కురిపించే ఆదాయవనరుగా మార్చుకున్నాయి చైనా కంపెనీలు. ఇక్కడి జుట్టును అక్రమంగా చైనా, బంగ్లాదేశ్, మయన్మార్, వియత్నాం వంటి దేశాలకు పంపించి... అక్కడి విదేశీమారక ద్రవ్యాన్ని తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ఏజెన్సీలకు హవాలా రూపంలో పంపుతున్నాయి. ఏటా రూ.8వేల కోట్ల విలువైన జుట్టును అక్రమంగా రవాణా చేస్తూ ఆయా కంపెనీలు దందా సాగిస్తున్నాయి.

crores of hawala money coming to hyderabad with hair illegal transport

author img

By

Published : Dec 17, 2021, 5:35 PM IST

hair illegal transport: దిల్లీ కేంద్రంగా డోకిపే, లింక్‌యున్‌ కంపెనీలు వివిధ అక్రమాలకు పాల్పడుతున్నాయి. జుట్టు అక్రమ రవాణాతో పాటు.. ఆన్‌లైన్‌ గేమింగ్‌ ద్వారా వచ్చిన నగదును తెలుగురాష్ట్రాల్లో కొన్ని ఏజెన్సీలకు బదిలీ చేసి.. విదేశీమారక ద్రవ్యాన్ని హవాలారూపంలో చైనాకు తిరిగిపంపుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన ఈడీ ఆయా ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కొద్దిరోజుల్లోనే రూ.217కోట్ల జుట్టును హైదరాబాద్‌ నుంచి మయన్మార్‌కు అక్రమంగా రవాణా అయ్యిందని.. 15 మంది వ్యక్తులు, కంపెనీలకు సంబంధం ఉందని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఒక్క వెంట్రుక లాగితే..

online gaming fraud: ఆన్‌లైన్‌ గేమింగ్‌లు నిర్వహిస్తున్న చైనా కంపెనీల కార్యకలాపాలపై ఈడీ అధికారులు ఏడాది నుంచి పరిశోధన కొనసాగిస్తున్నారు. ఎల్బీనగర్‌ నుంచి చైనాకు జుత్తు ఎగుమతి చేస్తున్న ఓ వ్యాపారి ఖాతాలో కొద్దినెలల క్రితం రూ.72లక్షల నగదు జమయ్యింది. ఆయన ఎగుమతి చేసిన జుట్టుకు సరిపడా నగదు వచ్చినా.. అది చైనా నుంచి కాకుండా దిల్లీలోని డోకిపే, లింక్‌యున్‌ సంస్థల నుంచి వచ్చినట్టు గుర్తించారు. అప్పటి నుంచి ఆ రెండు సంస్థల కార్యకలాపాలపై నిఘా ఉంచారు. ఈ క్రమంలో తొమ్మిది నెలల క్రితం కోల్‌కతాకు చెందిన హ్యుమన్‌ హెయిర్‌ అండ్‌ హెయిర్‌ ప్రొడక్ట్స్, మాన్యుఫ్యాక్చరింగ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ సంఘం ప్రతినిధులు తమ సంఘంలో లేని కొన్ని కంపెనీలు అక్రమంగా చైనా, వియత్నాం, బంగ్లాదేశ్​కు జుట్టు పంపుతున్నాయంటూ ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మరో కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు.. నాలుగు నెలల క్రితం హైదరాబాద్, సికింద్రాబాద్, తణుకులోని పదిహేను కంపెనీల లావాదేవీలను పరిశీలించగా.. అక్రమాలు జరిగినట్టు తేలింది.

హైదరాబాద్​ కేంద్రంగా..

శంషాబాద్‌ నుంచి ఐజ్వాల్‌కు జుట్టు అక్రమ రవాణాలో హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న న్యాలా ఫ్యామిలీ ఎక్స్‌పోర్ట్స్‌ కీలకపాత్ర పోషించింది. లింక్‌యున్, డోకిపే సంస్థలతో సంబంధాలున్న న్యాలా ఫ్యామిలీ ఎక్స్‌పోర్ట్స్‌ కంపెనీలు వాల్‌ ఫై అనే విదేశీయుడు, హైదరాబాద్‌లో ఉంటున్న మహ్మద్‌ ఇబ్రహీం, దువ్వాడ శ్రీకాంత్‌ ఉన్నారని గుర్తించారు. వీళ్లు సాయి ఇంప్లెక్స్, ఎస్‌.ఎస్‌.ఇంప్లెక్స్, శివకేశవ్‌ హ్యూమన్‌ హెయిర్, శైలు ఎంటర్‌ప్రైజెస్, నరేష్‌ ఉమన్‌ హెయిర్‌ కంపెనీల ద్వారా జుత్తును కొనుగోలు చేసి శంషాబాద్‌ విమానాశ్రయం ద్వారా ఐజ్వాల్‌ విమానాశ్రయానికి పార్శిళ్ల రూపంలో పంపుతున్నారు. అక్కడ సెయింట్‌ మేరీ జెమ్‌ ఇండస్ట్రీస్, సన్‌మూన్‌ హ్యూమన్‌ హెయిర్‌ కంపెనీలకు పంపుతున్నారు. ఐజ్వాల్‌ నుంచి బంగ్లా, చైనా, మయన్మార్‌ సరిహద్దుల ద్వారా ఈ జుట్టు అక్రమంగా రవాణా అవుతోందని ఈడీ అధికారులు గుర్తించారు. ఈ వివరాల ఆధారంగా సీసీఎస్‌ పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.