ETV Bharat / crime

COW SUSPECT DEATH: యూనివర్సిటిలోకి వెళ్లిన ఆవు.. తెల్లారేసరికి..! - Cow died in AU

మేత కోసం పొరపాటున ఆంధ్ర విశ్వవిద్యాలయంలోకి వెళ్లిన ఆవుని కొట్టారో లేక ఏం చేశారో తెలియదు, ఆవు చనిపోయింది. రాత్రికి రాత్రే ఖననం చేశారు విశ్వవిద్యాలయ సెక్యూరిటీ గార్డ్​. గోరక్ష దళాలు, ఆవు యజమాని..పోలీసులకు ఫిర్యాదు చేశారు.

COW SUSPECT DEATH: యూనివర్సిటిలోకి వెళ్లిన ఆవు..తెల్లారేసరికి..!

author img

By

Published : Jul 25, 2021, 11:45 AM IST

COW SUSPECT DEATH: యూనివర్సిటిలోకి వెళ్లిన ఆవు..తెల్లారేసరికి..!

మేతకెళ్లిన ఆవు దారి తప్పింది. సెక్యూరిటీ అధికారి గోవును బంధించాడు. యజమాని జరిమానా కట్టి వెళ్లేసరికి.. ఆవుకి స్పృహ లేదు. అక్కడే వైద్యం చేయించి రాత్రి ఇంటికెళ్లాడు. మరుసటి రోజు వెళ్లేసరికి ఆవును ఖననం చేసేశారు. విశాఖ ఆంధ్రవర్సిటీలోకి దారితప్పి వెళ్లిన ఆవు చనిపోవడం ఇప్పుడు వివాదాస్పదమైంది.

ఏపీలోని విశాఖ ఆంధ్రా విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి వెళ్లిన ఆవు చనిపోవడం ఇప్పుడు పోలీస్‌ స్టేషన్‌లో కేసుల వరకూ వెళ్లింది. మేతకు వెళ్లి పొరపాటున ఏయూ ప్రాంగణంలోకి ప్రవేశించిన గోవును వర్సిటీ ముఖ్య భద్రతా అధికారి ఖాన్‌ సిబ్బందితో కలిసి బంధించినట్లు యజమాని అప్పారావుకు తెలిపారు. ఆవుని విడిపించేందుకు వెళ్తే 10 వేల రూపాయలు జరిమానా కట్టాల్సిందిగా సెక్యూరిటీ సిబ్బంది చెప్పారని తెలిపారు. అంత చెల్లించలేనంటూ వర్సిటీ అధికారులు, మరికొందరిని బతిమాలగా చివరకు వెయ్యి రూపాయలు జరిమానా కట్టి ఆవుని తీసుకెళ్లాలని చెప్పినట్లు అప్పారావు తెలిపారు. జరిమానా కట్టి ఆవు దగ్గరికి వెళ్లేసరికి అప్పటికే స్పృహ తప్పి పడిపోయిందని,.. వైద్యుడిని తెచ్చి అక్కడే వైద్యం చేయించానని చెప్పారు. ఆ స్థితిలో ఆవుని అక్కడే విడిచిపెట్టి ఇంటికి వెళ్లానని రాత్రి వేళ ఫోన్‌ చేసి గోవు చనిపోయిందని చెప్పారని తెలిపారు. పొద్దున్నే వెళ్లేసరికి ఆవును ఖననం చేసినట్లు చెప్పారని అప్పారావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆవు యజమాని అప్పారావుతో కలిసి భాజపా, జనసేన, గో రక్షణ బృందం నాయకులు విశాఖ మూడో పట్టణ పోలీస్​ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సెక్యూరిటీ బృందంపై అనుమానాలు వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: సమయానికి రమ్మన్నారని.. ప్రధానోపాధ్యాయురాలిపై దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.