ETV Bharat / crime

couple suicide: మా చావుకు ఆ ముగ్గురే కారణం.. దంపతుల సూసైడ్ నోట్

వరంగల్​ గ్రామీణ జిల్లా పరకాలకు చెందిన దంపతుల ఆత్మహత్య ఘటనకు సంబంధించి కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఆత్మహత్యకు ముందు తీసిన సెల్ఫీ వీడియో, సూసైడ్​ నోట్​ లభించాయి.

couple suicide
couple suicide
author img

By

Published : Jul 30, 2021, 5:33 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలో ఆత్మహత్య ఘటనలో మృతి చెందిన దంపతులకు సంబంధించిన సెల్ఫీ వీడియో ఆలస్యంగా బయటికి వచ్చింది. దుగ్గొండి మండలం పొనకల్లుకు చెందిన కేశవ స్వామి, సంధ్యారాణి వారి ఇద్దరి పిల్లలతో కలిసి హన్మకొండలో నివసించేవారు. విద్యుత్‌ శాఖలో పని చేస్తున్న ముగ్గురు వ్యక్తులు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి తమను మోసం చేసినట్లు బాధితులు వాపోయారు. వారి కారణంగానే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ తీసుకొని పురుగుల మందు తాగి పరకాలలో నిన్న ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వ్యవహరంతో తన రెండో భార్యకు కేశవస్వామి తెలిపారు.

విద్యుత్ శాఖలో పనిచేస్తున్న పుల్ల బాబు, వాల్ నాయక్, గాడిపల్లి వెంకటేశం... ఈ ముగ్గురి కారణంగానే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని... తన ద్వారా కొంతమంది వద్ద డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. డబ్బులు ఇచ్చినవారు తనపై ఒత్తిడి తెస్తుంటే.. ఏమి చేయాలో తెలియని స్థితిలో బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు.

పరకాలలో దంపతుల ఆత్మహత్య... ఇదే కారణం

ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి తాను వసూలు చేసి ఇచ్చిన సొమ్మును కాజేసిన పుల్లా బాబు, గాడిపల్లి వెంకటేశ్​, నాయక్​లను కఠినంగా శిక్షించాలని సెల్ఫీ వీడియోలో విజ్ఞప్తి చేశాడు. తాను ఏతప్పు చేయలేదని.. బాధితులకు ముఖం చూపించలేక తనువు చాలిస్తున్నానని చెప్పుకొచ్చాడు. మోసం చేసిన వారి నుంచి డబ్బులు వసూలు చేసి బాధితులకు అందించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరాడు.

ఇదీ చూడండి: Madhapur murder : ఇంట్లో వాళ్లకి చెప్పమందనే.. హత్య, ఆపై ఆత్మహత్య!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.