ETV Bharat / crime

ఆగి ఉన్న లారీని ఢీకొని పోలీస్ కానిస్టేబుల్ మృతి - telangana news

ఆగి ఉన్న లారీని ఢీకొని కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా ఆత్మకూరులో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కానిస్టేబుల్​ స్వగ్రామం ములుగు జిల్లా జంగాలపల్లి అని తెలిపారు.

పోలీస్ కానిస్టేబుల్ మృతి
పోలీస్ కానిస్టేబుల్ మృతి
author img

By

Published : Jun 20, 2021, 8:46 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుల్ల క్రాస్ రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొని మాడబోయిన తిరుపతి అనే పోలీస్ కానిస్టేబుల్ మృత్యువాత పడ్డాడు. ద్విచక్రవాహనంపై ములుగువైపు వెళుతున్న తిరుపతి రోడ్డుపై నిలిచి ఉన్న లారీ వెనుక భాగాన్ని ఢీకొనడంతో తలకు తీవ్రంగా గాయాలయ్యాయి.

వెంటనే స్థానికులు స్పందించి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రాణాలు కోల్పోయాడు. వరంగల్ అర్బన్ జిల్లా మామునూర్ పోలీస్ స్టేషన్​లో తిరుపతి విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కానిస్టేబుల్​ స్వగ్రామం ములుగు జిల్లా జంగాలపల్లి అని తెలిపారు.

ఇదీ చదవండి: Brutal murder: కారుని అడ్డుకుని.. కత్తులతో పొడిచి దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.