ETV Bharat / crime

కుక్క తెచ్చిన గొడవ.. శత్రువుల మధ్య మరింత పెరిగిన వైరం.! - తిరుపతి జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ కత్తులతో దాడి

Conflict between two groups: ఓ కుక్క రెండు వర్గాల మధ్య చిచ్చు రేపింది..! కారంపొడి, కత్తులతో దాడి చేసుకునేలా చేసింది. 11 మంది తీవ్రంగా గాయపడేలా చేసింది..! ఇంతకీ.. ఆ కుక్క ఏం చేసిందో తెలియాలంటే.. ఈ వార్త చదవాల్సిందే.

Conflict between two groups
కుక్క తెచ్చిన గొడవ
author img

By

Published : May 18, 2022, 5:27 PM IST

Conflict between two groups: కుక్క పెట్టిన ఈ గొడవ ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. కేవీబీపురం మండలం అంగేరి చెరువు గ్రామానికి చెందిన మహేశ్​.. ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఏదో పనిమీద అలా బజారులో నడుస్తూ వెళ్తున్నాడు. కాస్త దూరం వెళ్లగానే.. అక్కడున్న కుక్క అతన్ని కరవడానికి వచ్చింది. దీంతో.. ఆత్మరక్షణలో భాగంగా ఓ రాయి తీసుకొని కుక్క మీదకు విసిరాడు. ఆ రాయి గురితప్పి, ఓ ఇంట్లోకి వెళ్లి పడింది. వేరే ఎవరో ఇంట్లో పడితే పెద్దగా సమస్య ఉండేది కాదు. కానీ.. ఆ రాయి పడింది బద్ధ శత్రువు ఇంట్లో!

మహేశ్​ ఇంటికి దగ్గర్లోనే ఉన్న వెంకటరామయ్య ఇంట్లో ఆ రాయి పడింది. ఈ రెండు కుటుంబాల మధ్య పదేళ్లుగా వివాదాలు ఉన్నాయి. ఇప్పుడు కుక్కపై విసిరిన రాయి.. మరోసారి ఆ వివాదాలను తెరపైకి తెచ్చింది. వెంటనే ఆవేశంతో రగిలిపోయిన వెంకట్రామయ్య కుటుంబసభ్యులు మహేశ్​తో గొడవకు దిగారు. ఈ విషయాన్ని మహేశ్​ తన కుటుంబ సభ్యులకు తెలపడంతో.. వాళ్లూ రంగంలోకి దిగారు. ఇంకేముంది? చూస్తుండగానే చినికి చినికి గాలివానలా మారిన గొడవ.. తుపానులా మారిపోయింది.

ఇరు కుటుంబాల వారు పరస్పరం.. కత్తులు, కర్రలు, కారం పొడితో.. ఓ రేంజ్​లో కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో రెండు వర్గాలకు చెందిన 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వైద్యం కోసం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇవీ చదవండి: మేం అధికారంలోకి వస్తే.. 30 రోజుల్లోనే రూ.2లక్షలు మాఫీ: రేవంత్‌రెడ్డి

లండన్‌లో కేటీఆర్‌కు గ్రాండ్ వెల్‌కమ్.. క్రేజీ ఫొటోస్ షేర్ చేసిన మంత్రి

తగ్గిన బంగారం ధర.. వెండి పైపైకి.. స్టాక్​ మార్కెట్లకు మళ్లీ నష్టాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.