ETV Bharat / crime

కేయూ భూములను కబ్జా చేసిన సీఐ.. భవన నిర్మాణానికి ఏర్పాట్లు!

అతను శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసు అధికారి. కానీ ఏకంగా విశ్వవిద్యాలయ భూమినే దర్జాగా కబ్జాచేశాడు. అక్కడ భవనం కట్టి కోట్ల ఆస్తిని కొల్లగొట్టేందుకు.. పట్టువదలని విక్రమార్కుడిలా పావులు కదుపుతున్నాడు. ఈ ఆక్రమణ పర్వానికి పలువురు రెవెన్యూ అధికారులు సైతం కొమ్ముకాస్తున్నారు. వర్సిటీ భూమిని ధారాదత్తం చేసేందుకు వంతపాడుతున్నారు. వరంగల్​ జిల్లాలోని కాకతీయ విశ్వవిద్యాలయం భూముల్లో ఆక్రమణ పర్వమిది.

ci-occupied-kakatiya-university-lands
కేయూ భూములను కబ్జా చేసిన సీఐ
author img

By

Published : Jan 24, 2022, 3:18 PM IST

వరంగల్‌ కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన సర్వేనెంబరు 413లో సుమారు 500 గజాల స్థలాన్ని ఓ సీఐ దర్జాగా ఆక్రమించుకొన్నారు. తన భార్య పేరున పట్టా సైతం చేసేశారు. ప్రస్తుతం సదరు సీఐ భూపాలపల్లి జిల్లాలో పనిచేస్తున్నారు. కబ్జా చేసిన స్థలంలో ప్రహరీ కట్టి, కొన్నేళ్ల క్రితం ఓ చిన్న షెడ్డు వేశారు. భవన నిర్మాణానికి దరఖాస్తు చేసుకొని ఇంటినెంబరు పొందారు. గత సంవత్సరం బోరుబావి తవ్వేందుకు ప్రయత్నించగా.. వర్సిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. సీఐ వర్సిటీ భూములను ఆక్రమిస్తున్నారంటూ.. తగిన చర్యలు తీసుకోవాలని వర్సిటీ రిజిస్ట్రార్‌ మున్సిపల్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

త్వరలో సర్వే నివేదిక

ఆక్రమించిన భూమి.. హనుమకొండ జిల్లా పలివేల్పుల గ్రామ పరిధిలోని సర్వే నెంబరు 413లో ఉండగా.. 414 సర్వే నెంబరులో తన స్థలం ఉన్నట్లు సీఐ నకిలీ పత్రాలు సృష్టించారు. కాగా కేయూ భూములు ఆక్రమణకు గురవుతుండడంతో స్థలాలను కాపాడేందుకు ప్రహరీ నిర్మాణం చేపట్టాలని విద్యార్థి సంఘాల నుంచి డిమాండ్ రావడంతో కేయూ పాలక వర్గం సర్వే చేయించేందుకు సిద్ధమైంది. గత సంవత్సరం సర్వే ఆఫ్‌ ల్యాండ్‌ రికార్డుల అధికారులు ‘డీజీపీఎస్‌’ సర్వే చేశారు. త్వరలో సర్వే తుది నివేదిక రానుంది.

సీఐకే రెవెన్యూ అధికారుల దన్ను..!

నివేదిక వచ్చాక తాను ఆక్రమించిన భూమి కేయూ పరిధిలోకి వెళ్లడం ఖాయమని భావించిన సీఐ.. ఆలోపే వ్యవహారం చక్కదిద్దుకోనేందుకు ఎత్తుగడ వేశారు. బోరు బావి వేసేందుకు తనకు అనుమతి ఇవ్వాలని తాజాగా తహశీల్దారుకు దరఖాస్తు చేసుకున్నారు. రెవెన్యూ అధికారులు సర్వే నివేదిక వచ్చే వరకు ఎలాంటి అనుమతి ఇచ్చేది లేదని చెప్పాల్సిందిపోయి.. సదరు సీఐ స్థలం కేయూ పరిధిలో ఉందీ లేనిదీ మరోసారి విచారణ చేపట్టాలంటూ అనుమతి ఇచ్చేందుకు అనుకూలంగా వ్యవహరిస్తుండడం గమనార్హం.

413సర్వే నెంబర్​ మొత్తం కేయూ భూములే..

కేయూ భూములకు సంబంధించి 1,968 నుంచి ఉన్న అన్ని రికార్డుల ప్రకారం విలేజ్‌ మ్యాప్, టీపన్, అసలు సేత్వార్, సప్లమెంటరీ సేత్వార్‌లతో పాటు, ఆధునిక గూగుల్‌ మ్యాప్‌లో కూడా 413, 414 సర్వేనెంబర్లు కనిపిస్తున్నాయి. 413 సర్వే నెంబరులో పూర్తిగా కేయూ భూములే ఉండగా, 414 సర్వే నెంబరు కొంత మేర ప్రైవేట్ పట్టాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సదరు సీఐ 413లో స్థలం ఆక్రమించి 414లో ఉన్నట్టు నకిలీ పత్రాలు సృష్టించినట్టు స్పష్టమవుతోంది. అధికారులు స్పందించి తుది సర్వే నివేదిక విడుదల చేసి ప్రహరీ నిర్మిస్తేనే కేయూ భూముల్లో ఆక్రమణల పర్వం ఆగుతుంది.

ఇదీ చూడండి: సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.