CI Nageshwar Rao Case Update: వివాహితపై అత్యాచారం, కిడ్నాప్, తుపాకీతో బెదిరింపు కేసులో అరెస్టయిన సీఐ నాగేశ్వరరావు జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. చర్లపల్లి జైలులో సిబ్బంది, తోటి ఖైదీలతో సరదాగా కబుర్లు చెబుతున్నట్లు సమాచారం. తప్పు చేశాననే పశ్చాత్తాపం కూడా కనిపించలేదని తెలుస్తోంది. తనకేం కాదనే ధీమాగా ఉన్నాడని, అక్కడి సిబ్బందితో తాను తేలికగా కేసు నుంచి బయటపడతానంటూ చెబుతున్నట్లు తెలిసింది.
సంచలనం రేకెత్తించిన కేసులో మరిన్నివివరాలు రాబట్టేందుకు వారం కస్టడీ కోరుతూ వనస్థలిపురం పోలీసులు గురువారం న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం శుక్రవారమే నాగేశ్వరరావును కస్టడీకి తీసుకునేందుకు పోలీసులకు అనుమతిచ్చిందని, ఈ మేరకు జైలులో ఉన్న అతడికి నోటీసులు కూడా జారీచేసినట్లు సమాచారం. పోలీసులు మాత్రం కస్టడీ పిటీషన్‌పై సోమవారం విచారణ జరుగుతుందంటున్నారు. కస్టడీకి తీసుకున్న తరువాతనే కేసు రీ కనస్ట్రక్షన్ చేస్తామంటున్నారు. కస్టడీకి అనుమతినిచ్చినా అదుపులోకి తీసుకోలేదనే ఊహాగానాలను పోలీసు అధికారులు కొట్టిపారేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
ఈ నెల 6న వివాహితపై అత్యాచారం చేసి, బాధితురాలితో పాటు ఆమె భర్తను బలవంతంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని ఎల్మినేడుకు కారులో తీసుకెళుతుండగా కారు ప్రమాదానికి గురైంది. కారు నడుపుతున్న నాగేశ్వరరావు భుజానికి గాయం కావడంతో బాధిత దంపతులిద్దరూ తప్పించుకొని వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ దురాగతం బయటపడింది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశారు. ప్రమాదంలో గాయపడిన ఇన్స్పెక్టర్ తొలుత అజ్ఞాతంలోకి వెళ్లాడు. బాధితులతో మాట్లాడి రాజీ కుదుర్చుకునేందుకు యత్నించాడు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఆయనను పట్టుకొనేందుకు మూడు పోలీసు బృందాలను రంగంలోకి దించారు. ఈ క్రమంలోనే ఎస్వోటీ పోలీసులు నాగేశ్వరరావును అరెస్ట్ చేశారు.
ఇవీ చదవండి: