Child marriage in Rangareddy district: నేటి సమాజం సాంకేతకంగా ఎంతో కొత్తపుంతలు తొక్కుతోంది. ప్రతి విషయంలోను శాస్త్రీయ అవగాహన వస్తోంది. కానీ మన దేశంలో అక్కడక్కడ అనాగరికపు ఆనవాళ్లు కనిపిస్తూనే ఉన్నాయి. ఎక్కడోచోట బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి.
పేదరికం, మూఢనమ్మకాలు, డబ్బుఎర చూపడం వంటి కారణాల వల్ల ఆటలాడుకోవాల్సిన వయసులో అత్తారింటికి సాగనంపుతున్నారు. పసివయసును నుసిచేస్తున్నారు. బాల్య విహహాలు జరిపిన వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకున్నా క్షేత్రస్థాయిలో వివాహాలు ఆగక మానడంలేదు.
మొయినాబాద్ మండలం చాకలిగూడ గ్రామానికి చెందిన వెంకటయ్య అనే వ్యక్తి తన పదమూడేళ్ల కూతురుకి బాల్య వివాహం చేశాడు. కనకమామిడి గ్రామానికి చెందిన వ్యక్తితో గుట్టు చప్పుడు కాకుండా తమ పక్కింటి వాళ్ల సహాయంతో ఎవరికి తెలియకుండా జరిపించాడు.
ఫామ్‌హౌస్‌లో గత ఆదివారం నాడు ఉదయం ఐదు నుంచి ఏడు గంటల ప్రాంతంలో పది నుంచి పన్నెండు మంది సమక్షంలో బాల్య వివాహం జరిపించినట్టు తెలుస్తుంది. అంగన్వాడి టీచర్ ఈ విషయాన్ని తెలుసుకుని మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: