చిన్నారి ఆడుకుంటూ వెళ్లి నీటి సంపులో పడి మృతి చెందిన విషాదకర ఘటన ఆదిలాబాద్ పట్టణం రాంనగర్ కాలనీలో చోటుచేసుకుంది. ఒక్కగానొక్క కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
సాదిక్-శిరీన్ దంపతుల కూతురు ఆలియా(3), బంధువైన మరో చిన్నారి అల్ఫియాలు ఇంటి బయట ఆడుకుంటున్నారు. ఆవరణలో ఉన్న నీటి సంపు వద్దకు వెళ్లిన ఆ ఇద్దరు ప్రమాదవశాత్తు అందులో పడ్డారు.
ఆల్ఫియా చేతులను గమనించి చిన్నారిని పైకి లాగడంతో పాప ప్రాణాలతో బయటపడింది. నీట మునిగిన ఆలియాను కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు.
ఇదీ చదవండి: రెండు పెళ్లిళ్లు చేసుకున్న భర్తకు భార్యల దేహశుద్ధి