CBN and lokesh fires on govt: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పొత్తంగి గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త కోన వెంకట్రావుది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. పోలీసులు వేధించడం వల్లే వెంకట్రావు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు.
ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యే
తెదేపా కార్యకర్త కోన వెంకట్రావుది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని.. తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించినందుకే వేధించి ప్రాణాలు తీశారని ఆరోపించారు. మృతుడి కుటుంబానికి చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
-
వెంకట్రావు మృతికి కారణం అయిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, పోలీసుల పైన కేసు నమోదు చెయ్యాలి. వెంకట్రావు మృతితో తీవ్ర విషాదంలో ఉన్న ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను.(2/2)
— N Chandrababu Naidu (@ncbn) March 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">వెంకట్రావు మృతికి కారణం అయిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, పోలీసుల పైన కేసు నమోదు చెయ్యాలి. వెంకట్రావు మృతితో తీవ్ర విషాదంలో ఉన్న ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను.(2/2)
— N Chandrababu Naidu (@ncbn) March 8, 2022వెంకట్రావు మృతికి కారణం అయిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, పోలీసుల పైన కేసు నమోదు చెయ్యాలి. వెంకట్రావు మృతితో తీవ్ర విషాదంలో ఉన్న ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను.(2/2)
— N Chandrababu Naidu (@ncbn) March 8, 2022
రాష్ట్రంలో ఉన్నది పోలీసులా, వైకాపా నాయకుల అనుచరులా
పోలీసుల వైఖరి చూస్తే.. రాష్ట్రంలో ఉన్నది పోలీసులా, వైకాపా నాయకుల అనుచరులా అనే అనుమానం వస్తోందని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలు, వైకాపా అవినీతి, అక్రమాలను ప్రశ్నించిన వారిని ఇలా చంపుకుంటూ పోతే.. రాష్ట్రంలో వైకాపా నేతలు, పోలీసులు మాత్రమే మిగులుతారన్నారు. కోన వెంకటరావు మృతికి కారణమైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, పోలీసులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
-
ప్రభుత్వ వైఫల్యాలు, వైసీపీ అవినీతి, అక్రమాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని ఇలా చంపుకుంటూపోతే రాష్ట్రంలో వైసీపీ నేతలు-పోలీసులు మాత్రమే మిగులుతారు.(2/4)
— Lokesh Nara (@naralokesh) March 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">ప్రభుత్వ వైఫల్యాలు, వైసీపీ అవినీతి, అక్రమాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని ఇలా చంపుకుంటూపోతే రాష్ట్రంలో వైసీపీ నేతలు-పోలీసులు మాత్రమే మిగులుతారు.(2/4)
— Lokesh Nara (@naralokesh) March 8, 2022ప్రభుత్వ వైఫల్యాలు, వైసీపీ అవినీతి, అక్రమాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని ఇలా చంపుకుంటూపోతే రాష్ట్రంలో వైసీపీ నేతలు-పోలీసులు మాత్రమే మిగులుతారు.(2/4)
— Lokesh Nara (@naralokesh) March 8, 2022
సంబంధిత కథనం:
Suicide: తెదేపా కార్యకర్త ఆత్మహత్య... పోలీసుల వేధింపులేనా..!