CHAIN SNATCHING: హైదరాబాద్‌లో రెండు రోజుల వ్యవధిలోనే చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. వనస్థలిపురంలో రహదారిపై వెళ్తున్న రమణమ్మ అనే వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకొని గొలుసు దొంగతనానికి పాల్పడ్డారు. కానీ అంతలోనే కథ అడ్డం తిరిగింది. నిందితులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం లారీని ఢీ కొట్టింది. దీంతో స్ధానికులు అప్రమత్తమై దొంగలను పట్టుకున్నారు. ఈ క్రమంలో ఒకరిని పట్టుకొని వనస్థలిపురం పోలీసులకు అప్పగించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

రెండు రోజుల క్రితం కూడా నగరంలో చైన్ స్నాచింగ్ జరిగింది. పేట్ బషీర్బాద్లోని జయరాం నగర్‌కు చెందిన రమాదేవి కుమారుడితో కలిసి ఉదయం వాకింగ్ చేస్తున్నారు. వెనుక నుంచి వచ్చిన దుండగుడు ఆమె మెడలోనుంచి బంగారు గొలుసును లాకెళ్లాడు.
ఇదీ చదవండి: Prisoner Escapes from Court: పోలీసుల కళ్లుగప్పి కోర్టు నుంచి జీవిత ఖైదీ పరారీ