ETV Bharat / crime

చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతోన్న ముగ్గురు అరెస్ట్​ - hyderabad news

యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో పారిపోయేందుకు యత్నించిన ముగ్గురిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరు బంజారాహిల్స్‌, జీడిమెట్ల, ఎస్సార్​ నగర్ పోలీసు స్టేషన్‌ల పరిధిలో సెల్‌ఫోన్లు, చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

Chain Snatchers Arrested by banjara hills police
చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతోన్న ముగ్గురు అరెస్ట్​
author img

By

Published : Jan 25, 2021, 7:03 PM IST

హైదరాబాద్ పరిధిలో గొలుసు దొంగతనాలకు పాల్పడుతోన్న ముగ్గురు వ్యక్తులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు చరవాణులు, ఓ గొలుసును స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో అనుమానస్పదంగా వ్యవహారిస్తు పారిపోయేందుకు యత్నించడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. యాట శివకుమార్, మహేశ్​‌, జమాల్..‌ బంజారాహిల్స్‌, జీడిమెట్ల, ఎస్సార్​ నగర్ పోలీసు స్టేషన్‌ల పరిధిలో సెల్‌ఫోన్లు, చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు అంగీకరించారని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: మద్యం దుకాణంలో రూ.15 లక్షల నగదు చోరీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.