ETV Bharat / crime

దర్జీ కన్హయ్య హత్య కేసు.. పాతబస్తీలో ఎన్​ఐఏ సోదాలు..

NIA Raids in Old City : హైదరాబాద్ పాతబస్తీలో కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) సోదాలు జరిపింది. దర్జీ కన్హయ్య హత్య కేసు దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు చేపట్టింది. అరెస్టు అయిన ఓ నిందితుడి ఫోన్‌లో హైదరాబాద్​లో ఉంటున్న బిహార్ వాసి నంబర్ ఉండటంతో ఎన్​ఐఏ దాడులు చేసింది. దీనిపై ఇవాళ అధికారిక ప్రకటన చేసే అవకాశముంది.

NIA
NIA
author img

By

Published : Jul 6, 2022, 10:24 AM IST

NIA Raids in Old City : భాగ్యనగరంలోని పాతబస్తీలో కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. రాజస్థాన్‌కి చెందిన దర్జీ కన్హయ్య హత్య కేసు దర్యాప్తులో భాగంగా ఎన్​ఐఏ సోదాలు చేసింది. హత్య కేసులో అరెస్ట్ అయిన ఓ నిందితుడి ఫోన్​లో హైదరాబాద్​లో ఉంటున్న బిహార్ వాసి మహమ్మద్ మొనవౌర్ హుస్సేన్ కాంటాక్ట్ నంబర్ ఉండటంతో ఎన్​ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు.

మంగళవారం అతడిని అదుపులోకి తీసుకుని మాదాపూర్​లోని ఎన్​ఐఏ కార్యాలయానికి తరలించారు. బిహార్​కి చెందిన మహమ్మద్ మొనవౌర్ హుస్సేన్... గత 15ఏళ్లుగా సంతోశ్​ నగర్​లో ఓ మదర్సా నడుపుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. నేడు సోదాలపై అధికారికంగా ఎన్​ఐఏ అధికారులు ప్రకటన చేసే అవకాశం ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.