ETV Bharat / crime

విదేశీయులపై సమాచారం అంతంతే.. వీసాల్లేవ్‌... వివరాలూ తెలియవ్‌!

విద్య, ఉపాధి అవకాశాలు, పర్యాటక, వైద్య అవసరాల వీసాలతో దిల్లీకి వస్తున్న విదేశీయులు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సరైన సమాచారం ఉండడం లేదు. ప్రాంతీయ విదేశీ నమోదు కేంద్రాల్లో (ఎఫ్‌.ఆర్‌.ఆర్‌.ఒ)లో సక్రమంగా వివరాలను నమోదు చేయడం లేదు. సైబర్‌ నేరాలకు పాల్పడి పోలీసులకు చిక్కినప్పుడు వారి వివరాలు తెలుస్తున్నాయి. బాధితుల నుంచి కాజేసిన సొమ్ము అప్పటికే విదేశాలకు తరలిపోవడంతో పోలీసులు శిక్షలతో సరిపెడుతున్నారు. వీరిలో చాలా మంది నైజీరియన్లుండడంతో దిల్లీ, ముంబయి పోలీసులతోపాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులతో సంప్రదించి నైజీరియన్లు, ఇతర దేశస్థుల వివరాలను కోరనున్నారు.

do-not-have-proper-information-on-where-foreigners-are-going
విదేశీయులపై సమాచారం లేదు
author img

By

Published : Nov 9, 2021, 9:09 AM IST

‘ప్రవాస భారతీయ వైద్య నిపుణుడు డాక్టర్‌ చంద్రశేఖర్‌ను దిల్లీలో ఉంటున్న ముగ్గురు నైజీరియన్లు మూడు నెలల క్రితం ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం చేసుకున్నారు. జంతువులకు కరోనా టీకాను లండన్‌లో తయారు చేస్తున్నారు. అందుకు అవసరమైన నూనె మహారాష్ట్రలో లభిస్తోందని చెప్పారు. ఒక నైజీరియన్‌ కేరళ యువతిగా, మరో యువతి లక్ష్మి పేరుతో ఆయనతో మాట్లాడారు. నెలన్నరలో రూ.11.84 కోట్లు మోసం చేశారు. వీరు దిల్లీ నుంచి ఎక్కడికి వెళ్లారన్న వివరాలు పోలీసులకు లభించలేదు.’

లెక్కాపత్రాలు ఏవీ..

మెట్రో నగరాల్లో ఎంత మంది విదేశీయులున్నారన్న వివరాలపై కచ్చితమైన సమాచారం ఎక్కడా లభించడం లేదు. కరోనా వైరస్‌ ప్రభావానికి ముందు దిల్లీ, ముంబయిలలో 1500 మంది నైజీరియన్లు, అమెరికన్లున్నారు. నైజీరియన్లలో వీసా గడువు ముగిసినా చాలామంది ఇక్కడే ఉంటున్నారు. దిల్లీలోని వసంత్‌ కుంజ్‌లో ఉంటున్న 10 మందిని బెంగళూరు, మహారాష్ట్ర పోలీసులు కొద్దినెలల క్రితం అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ పోలీసులు ఆరు నెలల్లో 14 మందిని అరెస్ట్‌ చేయగా వీరిలో 9 మందికి వీసాల గడువు ముగిసింది.

ఫోన్‌ నంబర్లు.. వాట్సాప్‌ల సమాచారం..

సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న కొందరు నైజీరియన్లు, విదేశీయులు దిల్లీ, ముంబయిలలోని శివారు ప్రాంతాలు, బెంగళూరులో నివాసముంటున్నారు. ఉనికి తెలియకుండా గోప్యత పాటిస్తున్నారు. పోలీసులు వీరి గురించి తెలుసుకునేందుకు వారికి అనుమానం ఉన్న ఫోన్‌ నంబర్లు, వాట్సాప్‌ నంబర్లను కేంద్ర నిఘా వర్గాలు, సైబర్‌ నేరాల విభాగం, ఎఫ్‌.ఆర్‌.ఆర్‌.వోలకు పంపనున్నారు. ఫోన్‌ నంబర్లు స్విచ్ఛాఫ్‌ అని వచ్చినా, వాట్సాప్‌ నంబర్లు +44 సీరీస్‌ ఉన్న వాటి ఆధారంగా అవి ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలుసుకుని సమాచారం సేకరించాక వారి కదలికలపై నిఘా ఉంచనున్నారు.

ప్రతిచోటా పరిశీలించాలి...

భారత్‌కు వచ్చిన విదేశీయులైవరైనా సరే.. వారి పాస్‌ పోర్టు, వీసాలతోపాటు తిరుగు ప్రయాణం టిక్కెట్లను తీసుకున్నారా? లేదా? అన్న అంశాలను అధికారులు పరిశీలించాలి. విదేశీయులు ఎక్కడికి వెళ్తున్నా.. ఏం చేస్తున్నా.. ప్రాంతీయ విదేశీ నమోదు కేంద్రానికి సమాచారం ఇవ్వాలి. సమాచారం కోసం వారి ఫోన్‌ నంబర్లు ఇవ్వాలి. వైద్యం కోసం వస్తే సంబంధింత ఆసుపత్రి వైద్యుల ధ్రువపత్రాలు సమర్పించాలి. కొందరు విదేశీయులు నిబంధనలకు విరుద్ధంగా ఒక కేంద్రంలో పేరు నమోదు చేసుకుని అక్కడ స్థానిక చిరునామా ఇచ్చి వేరే నగరాల్లో ఉంటున్నారు. ముంబయిలో తమ పేర్లను నమోదు చేసుకుని హైదరాబాద్‌లో ఉంటున్నారు. గతంలో ఆరుగురు నైజీరియన్లను హైదరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి: CyberCriminals New Plan: సిమ్​ బ్లాక్​ చేసి... మహిళకు రూ.24 లక్షలు టోకరా

cyber crime complaint: అధిక లాభాల ఆశ చూపి.. నిండా ముంచేశారు!

Cryptocurrency: క్రిప్టో కరెన్సీ పేరిట మోసం... రూ.86 లక్షలు టోకరా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.