ETV Bharat / crime

Theft: అంత్యక్రియల్లో చోరీ... సీసీ కెమెరాల్లో దృశ్యాలు - అంత్యక్రియల్లో చోరీ

ఒకవైపు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతుండగా మరోవైపు చేతివాటం ప్రదర్శించారు దొంగలు. వారిలో ఒకరిగా కలిసిపోయి సెల్​ఫోన్ తస్కరించారు. ఏమీ ఎరగనట్టు అక్కడి నుంచి ఉడాయించారు. ద్విచక్రవాహనంపై వారు పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

cell phone theft
అంత్యక్రియల్లో చోరీ
author img

By

Published : Jul 8, 2021, 8:37 PM IST

దొంగతనం చేసేందుకు అంత్యక్రియలను వేదికగా ఎంచుకున్నారు కొందరు దుండగులు. అదే అదునుగా చేతివాటం ప్రదర్శించారు. ఓ వ్యక్తి మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలిస్తున్న సమయంలో చోరీకి పాల్పడ్డారు. వారిలో ఒకరిగా కలిసిపోయి అక్కడి వారి సెల్​ఫోన్ తస్కరించారు. ఈ ఘటన హైదరాబాద్​లోని లంగర్​హౌస్​​ పోలీస్​స్టేషన్ పరిధిలో జరిగింది.

సీసీ కెమెరాల్లో దృశ్యాలు

సెల్​ఫోన్ తస్కరించిన దొంగలు ఏమీ తెలియనట్లు అక్కడి నుంచి ఉడాయించారు. ద్విచక్రవాహనంపై దొంగలు పారిపోతున్న దృశ్యాలు సీసీ టీవీల్లో రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అంత్యక్రియల్లో చోరీ

ఇదీ చూడండి: STUDENT DEAD: గోడ కూలి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.