నిర్మల్ జిల్లా ముథోల్ మండలం గన్నోర సర్పంచ్ భర్త(CASE FILE ON SARPANCH HUSBAND)పై పోలీసులు కేసు నమోదు చేశారు. వేధింపులకు గురిచేస్తున్నాడంటూ అంగన్వాడీ టీచర్(anganwadi teacher) ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు(police) తెలిపారు. కిష్టయ్యపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు(sc, st atrocities act) నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
ఏడాది కింద గొడవ
గన్నోర గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్... సర్పంచ్ భర్తపై మంగళవారం సాయంత్రం ఫిర్యాదు చేశారని భైంసా ఏఎస్పీ కిరణ్ కారే తెలిపారు. గతేడాది నుంచి వారి మధ్య గొడవలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అంగన్వాడీ టీచర్ విధులు సక్రమంగా నిర్వహించడం లేదని సర్పంచ్ భర్త సీడీపీవో(CDPO)కు ఏడాది క్రితం ఫిర్యాదు చేశారని వెల్లడించారు.
వేధింపులపై ఫిర్యాదు
ఈ విషయంపై అధికారులు వచ్చి విచారణ జరిపారు. కిష్టయ్య ఫిర్యాదుతో అధికారుల ముందు అంగన్వాడీ టీచర్ క్షమాపణ చెప్పారు. అయినా వేధింపులకు గురిచేస్తున్నారని అంగన్వాడీ టీచర్ ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కిష్టయ్యపై కేసు నమోదు చేశాం.
-కిరణ్ కారే, భైంసా ఏఎస్పీ
కేసు నమోదు
ఈ విషయంపై అంగన్వాడీ కేంద్రంలోనే మంగళవారం గొడవ జరిగిందని... ఈ గొడవలో తనతో అసభ్యంగా మాట్లాడారని బాధితురాలు చెప్పినట్లు వివరించారు. సర్పంచ్ భర్తపై 354, 354A సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: WOMAN ARREST: 'గీతా ఆర్ట్స్' చెంత మహిళ హడావుడి.. అరెస్టు