భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ఆరో మైలు వద్ద అదుపుతప్పి కారు చెట్టును ఢీ కొట్టింది. సర్వారానికి చెందిన వెటర్నరీ అసిస్టెంట్ బన్సీలాల్, జగన్నాధపురానికి చెందిన రాజేంద్రప్రసాద్, కొత్తగూడెంకు చెందిన శిరీష, నరేశ్‌తో పాటు మరో వ్యక్తి కారులో ఏటూరు నాగారం వెళ్లారు.
శుక్రవారం రాత్రి తిరుగు ప్రయాణంలో ఆరో మైలు అటవీ ప్రాంతంలో వారి కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టడంతో... వాహనంలోని వ్యక్తులకు గాయాలయ్యాయి. నలుగురిని కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి, ఒకరిని ఇల్లెందు ప్రభుత్వాసుపత్రికి తరిలించినట్లు టేకులపల్లి పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: ఎంఎంటీఎస్ పునః ప్రారంభం ఎప్పుడో?