రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట్ ఔటర్ రింగ్‌రోడ్‌పై కారులో మంటలు చెలరేగాయి. ఓఆర్‌ఆర్‌పై కారు ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కారు ఇంజిన్ భాగంలో గంజాయిని తరలిస్తుండగా మంటలు వచ్చాయి. కారును వదిలేసి దుండగులు పరారయ్యారు.
![car fire accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/img-20210410-wa0053_1004newsroom_1618034621_786.jpg)
కారులోని మంటలను వాహనదారులు, స్థానికులు కలిసి ఆర్పారు. విజయవాడ నుంచి గంజాయి రవాణా చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి రవాణా చేస్తున్న వారి ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.
![car fire accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/img-20210410-wa0054_1004newsroom_1618034621_1023.jpg)
- ఇదీ చదవండి: ఎడ్లబండిని ఢీకొన్న టిప్పర్.. ఇద్దరు మృతి.