ETV Bharat / crime

పంట పొలాల్లోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి - అతివేగం

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దుంకుడు మోరి తండాలో విషాదం జరిగింది. భార్యా భర్తలు ప్రయాణిస్తున్న ఓ కారు.. అదుపుతప్పి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో.. కారు నడిపిన వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

car crashed into a crop field
పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
author img

By

Published : Apr 12, 2021, 5:24 PM IST

నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. కారు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దుంకుడు మోరి తండాలో జరిగింది.

నిజామాబాద్ జిల్లా రుద్రూర్​కు చెందిన సుబ్బారావు.. ప్రభుత్వ ఉపాధ్యాయినిగా విధులు నిర్వర్తిస్తోన్న భార్య పద్మజతో తిరుమలాపూర్​లోని​ పాఠశాలకు బయలుదేరాడు.​ అతి వేగంతో వస్తోన్న వాహనం.. దుంకుడు మోరి తండా దగ్గరకు రాగానే అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో కారు నడుపుతున్న సుబ్బారావు అక్కడికక్కడే ప్రాణాలు విడువగా.. తీవ్ర గాయాలపాలైన పద్మజను స్థానికులు... బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: డబుల్​ బెడ్​ రూం ఇల్లు పేరుతో కార్పొరేటర్​ అనుచరుడి మోసం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.