వేగంగా వచ్చిన ఓ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. డ్రైవర్ ప్రసాద్ రావు నిర్లక్ష్యం కారణంగా.. నాచారానికి చెందిన అక్బర్ ఖాన్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు. మెక్డొమినోస్లో విధులు ముగించుకుని బంజారాహిల్స్ నుంచి నాచారానికి వెళ్తున్న క్రమంలో బేగంపేట పీ అండ్ టీ ఫ్లై ఓవర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
అక్బర్ ఖాన్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి: బాలికపై సాఫ్ట్వేర్ ఉద్యోగి అత్యాచారం..