ETV Bharat / crime

BUS ACCIDENT: కాలువలోకి దూసుకెళ్లిన బస్సు.. తప్పిన ప్రాణాపాయం - orange travels bus

PEDDAPALLI ROAD ACCIDENT
కాలువలోకి దూసుకెళ్లిన బస్సు
author img

By

Published : Jan 8, 2022, 6:56 PM IST

Updated : Jan 8, 2022, 7:51 PM IST

18:55 January 08

BUS ACCIDENT: కాలువలోకి దూసుకెళ్లిన బస్సు.. తప్పిన ప్రాణాపాయం

తృటిలో మరో ఘోర బస్సు ప్రమాదం తప్పింది. ఇటీవల ఏపీలో జరిగిన బస్సు ప్రమాద ఘటన అందరికీ తెలిసిందే. సరిగ్గా అలాంటి ప్రమాదమే ఇవాళ జరిగింది. అదుపుతప్పిన ఆరెంజ్​ ట్రావెల్స్​ బస్సు పెద్దపల్లి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం మల్యాలపల్లి వద్ద జరిగింది.

తప్పిన ప్రాణాపాయం

అయితే ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 20 మంది క్షేమంగా బయటపడ్డారు. దీంతో మరో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

ఏపీలో పదిమంది జలసమాధి

ఇటీవల ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా జల్లేరు వద్ద జరిగి బస్సు ప్రమాద ఘటనలో పదిమంది జలసమాధి అయ్యారు. భద్రాచలంలో నుంచి బయలుదేరిన జంగారెడ్డిగూడెం బస్సు.. ఆ మండలం పరిధిలోని జల్లేరు వద్ద వంతెన రెయిలింగ్​ను ఢీకొంది. అదుపుతప్పి ఒక్కసారిగా 25 అడుగులు లోతు ఉన్న వాగులో పడింది.ఈ ప్రమాదంలో మరణించిన వారికి ఏపీ సీఎం జగన్​​ ఒక్కోక్కరికి రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించారు.

Last Updated : Jan 8, 2022, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.