ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు స్టీరింగ్ విరిగిపోయింది. శివగిరి నుంచి జంగారెడ్డిగూడెం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. విద్యార్థులతో సహా 70 మంది ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. డ్రైవర్ చాకచక్యంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. సమయస్పూర్తితో రోడ్డు పక్కన బస్సును నిలిపివేశాడు.
ఇదీ చదవండి: బ్యాంకులకు మళ్లీ 'కొవిడ్' ముప్పు